"విజయమ్మను ఓడించిన వైజాగ్"... ఇది కరెక్ట్ మాట... ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి తల్లిగా, ఆమె చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 2014లో జగన్ వైపు ఉన్న సెంటిమెంట్ కి కూడా లొంగకుండా, వైజాగ్ అంతా కలిసి, విజయమ్మను ఓడించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ఒక నెల ముందు, కడప నుంచి ఒక బ్యాచ్ ని దింపాడు జగన్. అక్కడ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. మాకు ఓటు వెయ్యకపోతే, మిమ్మల్ని చంపేస్తాం అన్నంతగా బెదిరించారు. దీని ఫలితమే, ఈ ఫ్యాక్షన్ మూక మాకు వద్దు అంటూ, వైజాగ్, విజయమ్మను తిరస్కరించింది. అంతకు ముందు, రాజశేఖర్ రెడ్డి హయంలో, వైజాగ్ లో చేసిన కుంభకోణాలు కూడా ప్రజలకు గుర్తు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు ఈ సీన్ మార్చేయటానికి, జగన్ రంగంలోకి దిగారు. 2019లో ఎలా అయినా వైజాగ్ అంతా గెలిచి, ఉత్తరంద్రలో బలం పెంచుకోవటానికి చూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 35 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఒక్కో జిల్లాలో మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గత ఎన్నికల్లో తీవ్రంగా నిరాశపర్చిన ఉత్తరాంధ్రలో సత్తాచాటాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే పాదయాత్ర విశాఖలోకి ప్రవేశించగానే చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని, జిల్లాపై మూడేళ్లుగా విజయ్‌సాయిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
పాదయాత్రలు, ప్రత్యేక హోదా ఆందోళనలు, జోనల్ పోరాటాలంటూ హాడావిడి చేస్తున్నారు. అటు విజయనగరంలోనూ బొత్స సత్యనారాయణ కుటుంబం పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. జనసేన ఎలాంటి ప్రభావం చూపుతోందా అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్న ఉత్తారాంధ్ర తిరిగి టీడీపీ సత్తాచాటడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. లాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గేర్ మార్చి సత్తాచాటాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబుపై మాటలతో విరుచుకుపడుతున్నారు. ఆయన మైనింగ్ డాన్ అంటూ ఐదు పెళ్లిళ్లు అంటూ జగన్ హడావిడి చేస్తున్నారు.