ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలోని 45 గ్రామాలకు వరద తాకిడి ఎక్కువగా ఉందని, బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. కాజ్‌వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నాం. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రెండు జిల్లాల్లో కలిపి రూ.600 కోట్ల నష్టం జరిగింది. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తాం. హెక్టారుకు రూ.25వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తాం.

cbn 22082018 4

ఎర్రకాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఆర్‌.అండ్‌.బి రహదారులకు రూ.35 కోట్లు కేటాయిస్తాం. రాయలసీమలో కరవు ఉంది… కోస్తాలో వరదలు వచ్చాయి. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో కరవు ఉంది. గోదావరి నుంచి 1500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పోలవరం పనులు 57.5శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోలవరం కోసం కేంద్రం నుంచి రూ.2,600 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా అభ్యంతరం లేదు. రాష్ట్రంలో 57 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టాం.. 16 పూర్తయ్యాయి’’ అని చంద్రబాబు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read