పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్ట్ ప్రతి స్టేజ్ లో, ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. సకాలంలో డబ్బులు ఇవ్వక, ఆ వడ్డీ భారం రాష్ట్రం మీద పడి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మరో పక్క, ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వక, డిజైన్స్ అప్రోవ్ చెయ్యక, నానా రకాలుగా విసిగిస్తున్నారు. రోజుకి ఒక కొర్రీ పెడుతూ, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకుండా, అడ్డు పడుతూ, ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ చెయ్యాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనే కాని, ఎక్కడా ప్రాజెక్ట్ త్వరతిగతిన పూర్తి చేద్దాం అనే ఆలోచన కొంచెమైనా లేదు. మరో పక్క ఇన్ని ఇబ్బందులు పెడుతూ, వంద రకాల తనిఖీలు చేసి, వంద రూల్స్ చెప్పి, రూపాయి రూపాయి విడుదల చేస్తూ, పోలవరంలో అవినీతి ఉందని ఆరోపిస్తారు..

modi 15082018 2

ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ పెద్దలు, నిన్న అన్ని దినపత్రికల్లో, తెలుగులో ప్రకటనలు ఇచ్చారు.'పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు' ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని ప్రత్యేక బహుమతి' అంటూ ప్రకటనలు గుప్పించారు. గత కొన్నాళ్ల నుంచి వివిధ అంశాలపై తాము ఆంధ్రాకు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నామంటూ, బిజెపి నేతలు ప్రచారం సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు, పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేస్తున్నారు. సహాయం చేస్తున్నాం అంటే అదో పద్ధతి, కాని, పోలవరం ప్రాజెక్ట్ మోడీ బహుమతి అంటూ, రాసి, తమ అవగాహాన రాహిత్యం, ప్రచార పిచ్చ మరోసారి బయట పెట్టుకున్నారు.

modi 15082018 3

పోలవరం ప్రాజెక్ట్ అనేది, విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హక్కు. ఇది మోడీ బహుమతీ కాదు, ఏమి కాదు. మోడీ ఉన్నా, మరో వ్యక్తి ఉన్నా, పోలవరం కట్టి తీరాలి. పోలవరం ప్రాజెక్ట్ మోడీ బహుమతి అంటున్న బీజేపీ వాళ్ళు, మిగతా 15 జాతీయ ప్రాజెక్ట్ ల పరిస్థితి ఎలా ఉందో చుస్తేనే అర్ధమవుతుంది. మరి ఈ బహుమతులు, మిగతా జాతీయ ప్రాజెక్ట్ లలో ఎందుకు కనిపిచటం లేదు ? ఇది మా ఆంధ్రల హక్కు.. ఎవరి భిక్షా, బహుమతి కాదు. పోలవరం ప్రాజెక్ట్ ఎవరి వల్ల, ఈ స్థాయికి వచ్చిందో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ బహుమతుల గురించి ప్రచారం చేసుకోకుండా, మాకు రావాల్సిన డబ్బులు టైంకి ఇచ్చి, ఏ కొర్రీలు లేకుండా అన్ని అనుమతులు టైంకి ఇస్తే, అప్పుడు మా ఆంధ్రులు కూడా, మోడీజీకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే వాళ్ళం.. ఇలాంటి మీడియా జిమ్మిక్కులు ఉత్తరాదిలో వేసుకోండి, మా రాష్ట్రంలో కుదరదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read