గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు టీడీపీకి బద్ధ శత్రువులుగా మారాయి. అయినప్పటికీ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. బీజేపీ, జనసేన పార్టీలతో తెగతెంపుల వల్ల కాస్తోకూస్తో వాటిల్లే నష్టాన్ని కూడా ముస్లిం ఓటర్లు, దళిత ఓటర్ల అండతో నివారించవచ్చనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఏపీలో దాదాపు 25శాతం ఓటు బ్యాంకు దళితులదే కావడం గమనార్హం. ముస్లిం ఓటర్లు కూడా 11శాతం మంది ఉన్నారు. అంటే.. దాదాపు 35శాతానికి పైగా ఓటు బ్యాంకు దళిత, ముస్లిం ఓటర్లదే కావడం విశేషం. దీంతో 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు టీడీపీ దళిత, ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా చంద్రబాబు సారథ్యంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవబోతుండటం విశేషం.

pk 14082018 2

ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ విషయానికొస్తే... జగన్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది. అయితే జగన్ అతి విశ్వాసం పార్టీకి నష్టం చేస్తుందనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. ఏ ప్రతిపక్షమైనా అవకాశం ఉన్నప్పుడు ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఎన్నికల సమరంలో నిలవాలని భావిస్తోందని.. జగన్ పార్టీకి అలాంటి అవకాశం వచ్చినప్పటికీ కాదనుకోవడం అతి విశ్వాసమేనని అంటున్నారు. 2014లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో లెఫ్ట్ పార్టీలు జగన్ పార్టీ వైపు చూశాయని, అయితే జగన్ పొత్తుకు సుముఖత చూపకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయని ఏఎన్‌యూకు చెందిన ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. 2014 ఎన్నికల్లో మాదిరిగానే జగన్ పార్టీ మళ్లీ అతి విశ్వాసంతో ముందడుగు వేస్తే రాజకీయంగా నష్టపోక తప్పదని అభిప్రాయపడ్డారు. పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలు, కాపు రిజర్వేషన్లపై చేసిన ప్రకటన.. ఈ రెండు అంశాలు ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

pk 14082018 3

జనసేన విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో పవన్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ లేకపోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేసే విషయం. అభ్యర్థులను అప్పటికప్పుడు హడావుడిగా ప్రజలకు పరిచయం చేసి కేవలం అధినేత చరిష్మాతోనే గెలుస్తామని జనసేన భావిస్తే ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురుకాక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కాంగ్రెస్, బీజేపీ కూడా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇస్తామనే వాగ్దానంతో కాంగ్రెస్, తాము న్యాయంగా ఏపీకి రావాల్సినవన్నీ ఇస్తే టీడీపీ మోసం చేసిందనే ఒకేఒక్క నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి. అయితే ఏపీలో బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ ప్రత్యేక హోదా నినాదంతోనే ఎన్నికల బరిలో నిలవబోతుండటం విశేషం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read