మోడీ, షా ద్వయం, తమ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో, అధికారం చేజిక్కించుకుంటానికి వేసిన, ఎత్తులు, ఇక్కడ కూడా వేస్తున్నారు. కాకపోతే, అక్కడ ఎన్నికల ముందు చేస్తే, మనకి మాత్రం, దాదాపు 10 నెలల ముందే రంగంలోకి దిగారు. గత ఆరు నెలలు నుంచి, అంటే తెలుగుదేశం ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి, మోడీ అనే వ్యక్తిని చాకిరేవు పెడుతున్న దగ్గర నుంచి, మన రాష్ట్రం పై, చంద్రబాబు పై కక్ష తీర్చుకోవటానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. చుక్కలు చూపిస్తాం అని ఒకరు, చంద్రబాబుని, లోకేష్ ని జైల్లో పెడతాం అని ఒకరు, ఇలా అనేక విధాలుగా బెదిరిస్తూ వచ్చారు.
రాష్ట్రంలో అన్ని శాఖల్లో, తీవ్రంగా సాధించారు. ఎక్కడన్నా కొంచెం అవినీతి ఉంటుంది ఏమో, చంద్రబాబుని లోపల వేద్దాం అని చూసారు. ఢిల్లీలో స్పెషల్ టీంలు, మీటింగ్ లు పెట్టుకుని, రివ్యూలు చేసారు, చివరకు చంద్రబాబుని, అవినీతి విషయంలో, ఏమి చెయ్యలేము అనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే, ఇప్పుడు రూట్ మార్చారు. ముఖ్యంగా, ఆర్ధిక మూలాల పై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా, ఇన్నాళ్ళు బీజేపీ స్టైల్ చూస్తే ఇలాగే ఉంటుంది. ఏ రాష్ట్రంలో అన్నా, ఎన్నికలు జరుగుతున్నాయి అంటే, అక్కడ కాంట్రాక్టర్ల పై దాడులు జరుగుతాయి. అక్కడ వారిని లొంగదీసుకుని, వ్యతిరేక పార్టీలకు ఎన్నికల ఫండ్ ఇవ్వకుండా చేస్తారు.
సరిగ్గా మనకి కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే నవయుగ లాంటి పెద్ద సంస్థ, పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిగెత్తిస్తున్న సంస్థ పై, ఐటి దాడులు చేసి, వారిని భయబ్రాంతులకు గురి చేసారు. ఇది పోయిన నెల జరిగినా, వార్తా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా మిగతా కాంట్రాక్టర్ ల పై కూడా దాడులు జరిగాయి. పోలవరం పనులు ఆపటం, తెలుగుదేశం పార్టీకి ఈ కాంట్రాక్టర్లు ఎన్నికల ఫండ్ ఇవ్వకుండా చెయ్యటమే, దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఇలా ఉండగానే, పోలవరం ప్రధాన కాంట్రాక్టర్, ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పై ఈ రోజు, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన హైదరాబాద్ కార్పోరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆయన పన్నులు కట్టకుండా ఎగవేశారని చెబుతూ ఈ దాడులకు దిగారు. భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో తెలుగదేశం ఎంపీ కార్యాలయంపై దాడులు జరగడం విశేషం. రాయపాటికి చెందిన ఇంజనీరింగ్ మరియు నిర్మాణం కంపెనీ ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ 2012లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను బేగంపేట్, కమలాపురికాలనీలో ఉన్నాయి.
అంతేకాదు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత ఈ దాడులు జరగడం చూస్తే ఇది రాజకీయ కక్షచర్య సాధింపేనని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. జీఎస్టీ కట్టాలని ఎలాంటి సూచనలు లేనందున తమ సిబ్బంది కూడా పట్టించుకోలేదని ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో వారంతా షాక్‌కు గురయ్యారని రాయపాటి తెలిపారు. 20212లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకుంది. అయితే పనులు సరిగ్గా చెయ్యకపోవటం వల్ల, ట్రాన్స్ ట్రాయ్‌కు అప్పగించిన పనులు నవయుగ చేతికి మారాయి.