ఈ దొంగ సాక్షి, దొంగ రాతలు గురించి చెప్పీ చెప్పీ విసుగు వస్తుంది... కాని, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది కాబట్టి, వీరి దొంగ రాతలను ప్రజలకు తెలిసేలా చేసి, ఇలాంటి వారిని ఎండగట్టటం కోసం తప్పటంలేదు... రోజుకి ఒక తప్పుడు కధనం రాయటం, దానికి ఒక క్రియేటివ్ స్టొరీ అల్లటం, బురద జల్లి వెళ్ళిపోవటం... సాక్షి పెట్టిన దగ్గర నుంచి ఇదే సీన్... ఎన్ని సార్లు దొరికినా, ఎన్ని సార్లు మీవి తప్పుడు రాతలు అని చెప్పినా, సాక్షి మాత్రం అన్నీ వదిలేసి, అవే తప్పుడు కధనాలు రాస్తుంది... తాజాగా గన్నవరం ఎమ్మల్యే పై, సాక్షి పేపర్ లో ఒక కధనం వచ్చింది. వల్లభనేని వంశీ,కబ్జా చేసారు అంటూ వార్తా రాసింది. దీని పై వంశీ ఘాటుగా స్పందిందిస్తూ, పత్రికా ప్రకటన ఇచ్చారు.
"ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం హాస్యాస్పదంగా ఉంది. గత పది సంవత్సరాలుగా కోట్లాది రూపాయల సొంత నిధులను వెచ్చించి వేలాదిమంది నిరుపేదలకు సేవాకార్యక్రమాలు చేస్తున్న నాపై ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఆరు సెంట్ల భూమిని ఆక్రమించుకున్నానంటూ కథను అల్లడం సాక్షి యాజమాన్యం దివాళాకోరుతనానికి నిదర్శనం. ఉంగుటూరు నా స్వగ్రామం, మరియు దత్తత తీసుకున్న గ్రామం. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి దారి లేకపోవడం, నిర్మాణ సామాగ్రిని చేరవేయడానికి గుత్తేదారు ఇబ్బందులు పడుతుండడంతో నా సొంతనిధులతో రహదారిని నిర్మించారు."
"ప్రాంగణంలో ఉన్న కంకర, ఇసుక పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినవి. అబద్దపు రాతలతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్న సాక్షి దినపత్రిక యాజమాన్యంపై పరువునష్టం దావా వేయనున్నాను. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని అనేక విచారణలను ఎదుర్కొంటూ జైలుకెళ్ళిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపరు ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ అందరికీ అవినీతి బురద పూయడానికి ప్రయత్నిస్తున్నారు. తనతోపాటు భారతిని కూడా ఈ.డీ కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు తీసుకెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా అబద్దపు కథనాలు ప్రచురిస్తున్నందుకు సాక్షి పత్రిక యాజమాన్యంపై త్వరలోనే న్యాయపరమైన చర్యలు తీసుకుని వారిని బోనులో నిలబెడతాం."