ఇది దారుణం... షాక్ అయ్యాను అంటూ, వైఎస్ భారతి ఈడీ కేసు గురించి, జగన్ చెప్పిన స్వాతి ముత్యం డైలాగ్ ఇది... వైఎస్ భారతి ఈడీ కేసు గురించి వార్తా పత్రికల్లో రాగానే, అసలు కంపెనీలతో భారతికి ఏం సంబంధం?, ఆడవాళ్ళను రాజకీయాల్లోకి లాగుతారా అంటూ, ఎంతో అమాయకంగా జగన్ ప్రశ్నలు వేసారు. అయితే, వీటినట్టికీ, ఈడీ తన చార్జిషీటులో సవివరమైన సమాధానం చెప్పింది. ‘క్విడ్‌ ప్రో కో’ పద్ధతిలో నిధుల ప్రవాహం జరిగిన ‘భారతి సిమెంట్‌’తో పాటు జగన్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా, ప్రధాన వాటాదారుగా వైఎస్ భారతి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. భారతి సిమెంట్‌కు సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదులో 19 మంది నిందితులుండగా... వారిలో భారతిని ఐదో నిందితురాలిగా పేర్కొన్నారు.

jagan 12082018 2

‘నేరపూరిత చర్యల ద్వారా వస్తున్న ఆర్థిక ఫలాలను ఆమె అనుభవిస్తున్నారు’ అని ఈడీ తేల్చిచెప్పింది. అంతేకాదు... విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని భారతికి మూడుసార్లు సమన్లు పంపినా పట్టించుకోలేదని వెల్లడించింది. ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లు, వాటాలు, స్థిర చరాస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని జగన్‌ కంపెనీలకు పలుమార్లు సమన్లు జారీచేసినా స్పందన లేదని స్పష్టం చేసింది. ‘‘జగన్‌ తన గ్రూప్‌ కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వైదొలగిన తర్వాత... భారతి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధుల బదిలీకి సంబంధించిన చెక్కులపై, ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లపైనా, ఇతర అన్ని పత్రాలపైనా ఆమే సంతకం చేస్తున్నారు’’ అని ఈడీ తెలిపింది

jagan 12082018 3

భారతి సిమెంట్స్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌లు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయని... ఇదంతా భారతి, జగన్‌ల అంగీకారం, అనుమతితోనే జరిగిందని స్పష్టం చేసింది. భారతి సిమెంట్‌లో మెజారిటీ షేర్‌ (51 శాతం) ఉన్న పర్‌ఫిసిమ్‌ కంపెనీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్‌ డైరెక్టర్లకంటే ఎక్కువ వేతనం భారతి తీసుకుంటున్నారని ఈడీ తెలిపింది. సిమెంట్‌ రంగంలో ఆమెకు ఎలాంటి అనుభవం లేదు. కానీ... ఆమె రూ.3.90 కోట్లు వార్షిక వేతనం తీసుకుంటున్నారని చెప్పింది.

jagan 12082018 4

2011 నుంచి 2015 వరకు ప్రతి ఏటా రూ.3.90 కోట్ల చొప్పున... ఐదేళ్లలో రూ.19.50 కోట్లు తీసుకున్నారని స్పష్టం చేసింది. భారతి సిమెంట్‌ లిమిటెడ్‌లో జగన్‌కు ఉన్న షేర్లు, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల నేపథ్యంలోనే ఆయన సతీమణికి ఈ స్థాయి వేతనం సాధ్యమైందని పేర్కొంది. అదే సమయంలో... జగన్‌ సన్నిహితుడు జెల్లా జగన్‌ మోహన్‌ రెడ్డి 2009 నుంచి 2015 మధ్య కాలంలో 7.18 కోట్ల భారీ వేతనం పొందారని తెలిపింది. కడప జిల్లాలో 2037.52 ఎకరాలలో విస్తరించిన సున్నపు గనుల లీజు గుజరాత్‌ అంబుజా సిమెంట్‌ లిమిటెడ్‌కు పునరుద్ధరించకుండా వైఎస్‌ జగన్‌, ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఆ గనులను తామేదక్కించుకున్నారు. 2006 మార్చి 27న ఈ జీవో వెలువడింది. 2037.52 ఎకరాలలో 475.16 ఎకరాల్లో నాణ్యమైన సున్నపు రాయి లేదంటూ ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read