బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒక మహిళ మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఎంపీ కారు ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి జీవీఎల్ కారు డివైడర్‌ని ఢీకొట్టింది. అనంతరం కారు అదుపు తప్పి మహిళతో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారులోనే ఉన్నారు. ప్రమాదం తర్వాత మరో కారులో విజయవాడ వెళ్లారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జీవీఎల్ తీరు పై విమర్శలు వస్తున్నాయి. ఆక్సిడెంట్ పొరపాటున జరిగినా, ఒక పక్క మహిళ చనిపోవటం, మరో పక్క ఇంకో మహిళ తీవ్రంగా గాయపడినా, జీవీఎల్ అలా విదిలి, తాను వేరే కార్ లో వెళ్ళిపోవటంతో అందరూ అవాక్కయ్యారు. ఒక ఎంపీగా ఆయనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు చేసి, పారిపోయే అలవాటు ఉన్న జీవీఎల్, ఇక్కడ కూడా ఆక్సిడెంట్ చేసి పారిపోయాడని, ఆయనికి, హిట్ అండ్ రన్ బాగా అలవాటు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చనిపోయిన ఆ మహిళకు శ్రద్ధాంజలి