ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వైజాగ్ మెట్రో, ఒక ముఖ్యమైన హామీ. నాలుగేళ్ళు గడిచినా, ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది. విజయవాడ మెట్రోకి, వైజాగ్ మెట్రోకి అభ్యంతరాలు పెడుతూనే ఉంది. కాని ఈ రెండు నగరాల కంటే చిన్నదైన, నాగపూర్ లో మెట్రోకి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్ని సార్లు మోర పెట్టుకున్నా వైజాగ్ మెట్రో పై కేంద్రం ఏ మాత్రం స్పందించలేదు. అందుకే ఇక చంద్రబాబు రంగంలోకి దిగారు. చంద్రబాబు అనేక ప్రయత్నాలు చెయ్యగా, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ చేపట్టడానికి దక్షిణ కొరియాకు చెందిన బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై మెట్రో ప్రాజెక్టుల్లో తమ అనుభవాలను వివరించారు.

cbn 25082018 2

విశాఖ మెట్రో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రతిష్టాత్మక ప్రొజెక్టని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం రాష్ట్రానికే ఒక మంచి ఆకర్షణ అని ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం, 8 వేల కోట్లు అవసరమనే అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించారు. ఈ ఖర్చు, ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం-సగం భరించాలని అనుకున్నాయి. అయితే కేంద్రం నుంచి సరైన సహకారం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ద్వారా సగం నిధులు పెట్టి, మిగిలిన సగం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలని నిర్ణయించింది.

cbn 25082018 3

దీనికి అనుగుణంగా టెండర్లు పిలవగా ప్రముఖ కంపెనీలు అయిన, టాటా, అదాని, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనే ఈ ఐదు సంస్థలు అర్హత సాధించాయి. ఈ ప్రాజెక్టు పనులు, రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజిలో సివిల్‌ పనులు వస్తాయి. అంతే కాకుండా, మెట్రో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలి. ఈ పనులన్నీ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ చూసుకుంటుంది. రెండవ ప్యాకేజీలో రైలు ట్రాక్‌ నిర్మాణం, సిగ్నలింగ్‌ వ్యవస్థ, జీపీఎస్‌ ఏర్పాటు, ఇతర మెకానికల్‌ పనులు ప్రైవేటు సంస్థ చేపడతాయి. ఈ రెండో దశ పనులను చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4 వేల కోట్ల నిధులు, కేంద్రం ఇవ్వదు అని స్పష్టం కావటంతో, విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read