విశాఖ ఎంపీ కొత్తపల్లి గీత తన కొత్త రాజకీయ పార్టీని నిన్నప్రకటించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. జనజాగృతి పార్టీ పేరుతో ఆమె తన కొత్త పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించారు. జనజాగృతి పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు గీత. అలాగే వెనుకబడిన కులాల వారికి, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇది ప్రజల పార్టీ అని, కొత్త తరహా పార్టీ అని, కొన్ని తీపి మాటలు చెప్పారు. ప్రజలతో మమేకమై మేనిఫెస్టోను రూపొందిస్తుందన్నారు. చంద్రబాబు దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
అయితే కొత్తపల్లి గీత పార్టీ వెనుక, బీజేపీ పార్టీ ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఓట్లు చీల్చటం కోసమే, ఆమె చేత కొత్త పార్టీ పెట్టుస్తున్నారని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే ఆమె టార్గెట్ అనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల పై సరైన ఆధారాలు లేకపోవటం, ఇవన్నీ పుకార్లే అని అందరూ నమ్మారు. కాని నిన్న ట్విట్టర్ లో జరిగిన రచ్చ చూస్తే, కొత్తపల్లి గీత వెనుక బీజేపీ ఉందనే సంగతి బలపడింది. #JanaJagrutiParty అనే హ్యాష్ ట్యాగ్ తో, ట్విట్టర్ లో చాలా పోస్ట్ లు పడ్డాయి. దీంతో, ఇది నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. కొత్తపల్లి గీతకు ఇంత సపోర్ట్ ప్రజల్లో ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. తీరా, కొంచెం లోతుగా చూస్తే, దీని వెనుక ఉన్నవాళ్ళు దొరికిపోయారు.
ఈ ట్వీట్లు చేస్తుంది అందరూ, ఉత్తరాది వారే. ఎక్కువగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, బీహార్ కు చెందినవారే ఉన్నారు. వీరు అంతా బీజేపీ కోసం, ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టి, ట్రెండ్ చేసే వారు. వీరు కొత్తపల్లి గీత అనే ఆమె పార్టీ గురించి పోస్ట్లు పెట్టటం ఒక వింత. ఎందుకుంటే, కొత్తపల్లి గీత అంటే ఎవరో ఆంధ్రాలోనే సరిగ్గా తెలియదు. అయితే, ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇటు జగన్, అటు మోడీతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు, పార్టీ పెట్టిన కొత్తపల్లి గీతకు ఇమేజ్ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నారు. ఆమెను బలోపేతం చేసి, అన్ని వానరులు ఇచ్చి, దళిత, గిరిజన సామాజిక వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసే ఆలోచనలో వీరు ఉన్నారు. అయితే, ఈమె గ్రౌండ్ లెవెల్ లో ట్రెండ్ అవ్వాలి కాని, ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే, ఏమి జరుగుతుందో, వారికే తెలియాలి.