లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తూత్తుకుడి ఎంపీ కనిమొళి ఎంపికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముగిసిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో 352 స్థానాల్లో ఘనవిజయం సాధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 303 స్థానాలను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ లోక్‌సభ స్పీకర్‌గా ఎంపికకావొచ్చని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభలో యూపీఏ కూటమికి 87 మంది ఎంపీలుండగా, వారిలో కాంగ్రెస్‌ సభ్యులు 52 మంది వున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించాలని భావించగా, అందుకు నిరాకరించిన ఆ పార్టీ మిత్రపక్షాలకు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

modishah 09062019

ఈ క్రమంలో, 22 మంది ఎంపీలతో లోక్‌సభలో మూడవ పెద్ద పార్టీగా ఉన్న డీఎంకేకు ఆ పదవి దక్కే అవకాశం వుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో చెలిమి చేస్తున్న డీఎంకే పార్టీకే డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తే బావుంటుందని ప్రతిపాదించిన కాంగ్రెస్‌, అందుకు కనిమొళి పేరును సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం లోక్‌సభలో డీఎంకే సభాపక్ష ఉపనేతగా ఉన్న కనిమొళికి గతంలో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో అన్ని పార్టీల ఎంపీలతో సత్సంబంధాలుండగా, బీజేపీకి చెందిన ఎంపీలతో కూడా సఖ్యతగా వుండేవారు. దీంతో, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా కనిమొళి ఎన్నికవ్వడం ఖాయమేనని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read