అధికారంలో ఉండే అహంకారంతో, ఏమి మాట్లాడుతున్నారో బీజేపీ నేతలకే అర్ధం కావటం లేదు. చివరకు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి లాంటి వాళ్ళు కూడా, ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, మోడీ లాంటి వారితో పోరాడిన చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఏమి చెప్పుకోవాలి. ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని నుంచి వచ్చేసరికి టీడీపీ పార్టీ అనేది ఖాళీ అయిపోతుందని విష్ణువర్థన్‌రెడ్డివార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు యూరప్ పర్యటన ముగిసేలోపే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని, ఆయనకు ఒక మంచి గిఫ్ట్ తో స్వాగతం పలుకుతామని అంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని ఆపే శక్తి ఎవరికీ లేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల మెడల్లో పచ్చ కండువాలు తీసి, కాషాయ కండువా కప్పుతామని విష్ణు వర్ధన్ రెడ్డి అంటున్నారు.

ఈ రోజు చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీలే కాదు, వచ్చే వారం రోజుల్లో, అసెంబ్లీలో 2/3 వంతు తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేలు బీజేపీలోకి రాబోతున్నారని, వాళ్ళని ఆపుకోండి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కరే కాదని, వారితో పాటు లోక్‌సభలో తెలుగుదేశం సభ్యులు కూడా బీజేపీలో చేరబోతున్నారన్నారు. రాయలసీమకు చెందిన ఎంతో మంది టీడీపీ కుటుంబాలు కూడా టచ్‌లో ఉన్నారని అన్నారు. ఇక మొన్నటి దాకా హడావిడి చేసిన, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా లైన్ లోకి వచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా మంది నాయకులు, బీజేపీ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టబోమని అన్నారు. భారతీయ జనతాపార్టీని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి, అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులను కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తామని గతంలో నేను చెప్పానని జీవీఎల్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read