అనుకోని ఓటమి... ముఖ్యమంత్రిగా కొన్నేళ్లుగా అలుపెరుగిన రాష్ట్ర సేవ... కుటుంబానికి దూరంగా 5 ఏళ్ళ పాటు సియంగా పని చెయ్యటం... పార్టీని పూర్తిగా ప్రక్షాళన చెయ్యాల్సిన సమయం... ఇలాంటి టైంలో కొంత రిలాక్స్ అవ్వటానికి, కుటుంబంతో కలిసి, కొంచెం మానసిక మార్పు కోసం, విదేశాలకు వెళ్లారు చంద్రబాబు. తిరిగి వచ్చిన తరువాత, పార్టీని పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వెయ్యాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆయన అలా విదేశాలకు వెళ్ళారో లేదో, ఇక్కడ తెలుగుదేశం పార్టీని కబలించి వెయ్యటానికి బీజేపీ పార్టీ రెడీ అయ్యింది. తెలుగుదేశం పార్టీ దిగ్గాజాలు, సీనియర్లు, ఆర్ధికంగా పుష్టిగా ఉన్న నాయకులని, తమ వైపు తిప్పుకే ప్లాన్ మొదలు పెట్టింది. సాక్షాత్తూ, మోడీ, అమిత్ షా కలిసి ఈ ప్లాన్ మొదలు పెట్టారు. ముందుగా రాజ్యసభ సభ్యులను టార్గెట్ గా చేసుకున్నారు. చంద్రబాబు లేని టైంలో, కీలకమైన రాజ్యసభ సభ్యులను లాగేసి, చంద్రబాబుని మరింత బలహీన పరిచి, మానసికంగా కుంగతీసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా, టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ , గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ లతో మంతనాలు జరిపారు. వారు పార్టీ మారటానికి అంగీకారం తెలపటంతో, వారిని తమ వైపు తిప్పుకోవటానికి స్కెచ్ వేసారు. తమ నలుగురుని తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండా, ప్రత్యెక గ్రూపుగా గుర్తించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి లేఖ ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మిగిలిన ఇద్దరు రాజ్యసభ నాయకులు, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ ను కూడా లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఇద్దరి కోసం కూడా, అమిత్ షా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా, ప్రస్తుతానికి, నలుగురు రెడీగా ఉన్నారని, వీరు ఏ క్షణమైనా రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చి, తమకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పనున్నారు. ఈ మొత్తం వ్యవహారం, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు, అమిత్ షా అప్పగించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read