ఇది రాజకీయ కక్షలు నడుస్తున్న కాలం... మాకు ఓటు వెయ్యకపోతే చంపేస్తాం.. మాకు ఓటు వెయ్యకపోతే రోడ్లు తవ్వేస్తాం... మాకు ఓటు వెయ్యకపోతే మీ ఇంటికి వెళ్ళకుండా అడ్డుగా గోడ కడతాం అంటూ, నడుస్తున్న కక్షల కాలం ఇది... ఇది ఒక్కటే కాదు, ప్రత్యర్ధుల పై దాడులు, మానసికంగా కుంగ తీసే పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, నేతలకు సెక్యూరిటీ తగ్గిస్తం కూడా చూసాం... మాజీ నేతలు అయితే వేరే విషయం, సిట్టింగ్ ఎమ్మల్యేలకు, నక్సల్స్ నుంచి ముప్పు ఉన్న వాళ్లకు కూడా భద్రత తగ్గిస్తున్నారు. ఇదే కోవలో, టెక్కలి ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు భాద్రత తగ్గించారు. అసెంబ్లీలో చేస్తున్న పోరాటానికి, ఇది గిఫ్టా అంటూ అచ్చెన్నాయుడుకు వర్గీయులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక్క గన్‌మెన్‌ను తిప్పి పంపించారు. 2014 నుంచి మంత్రి హోదాలో అచ్చెన్నాయుడుకు 4+4 గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించింది. అయితే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో 2+2 గన్‌మెన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వరకు ఇచ్చింది.

అయితే ఎందుకు తగ్గించిందో చెప్పకుండా, బుధవారం ఒక్కసారిగా గన్‌మేన్‌లను తగ్గించేసింది. బుధవారం ఒకే ఒక గన్‌మెన్‌ అచ్చెన్నాయుడు వద్దకు వచ్చు రిపోర్ట్ అయ్యారు. దీంతో తనకు ఆ ఒక్క గన్‌మేన్‌ కూడా అవసరం లేదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు టీడీపీ శాసనసభ ఉపనాయకుడుగా వ్యవహరిస్తూ, అధికార పక్షాన్ని ధీటుగా ఎదురుకుంటూ ప్రతిపక్ష నాయకుడు పాత్రను నిర్వహిస్తున్న ఈ టైంలో, సెక్యూరిటీ తగ్గించటంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు నక్సల్స్ నుంచి ముప్పు ఉందని తెలిసినా, సెక్యూరిటీ తగ్గించటం వెనుక ఏదో ఒక కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎర్రన్నాయుడు ఎంపీగా ఉండగా, శ్రీకాకుళం సమీపంలో సింగుపురం వంతెన వద్ద అప్పట్లో నక్సలైట్లు మందుపాత్ర పేల్చారు. అచ్చెన్నాయుడుకు కూడా గతంలో నిమ్మాడ సమీపంలో జిలిటెన్‌ స్టిక్స్‌ పెట్టి బెదిరించిన సంఘటనలు గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read