నిన్న ఢిల్లీలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై, అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో, పార్లమెంటు లోని లైబ్రరీ హాల్ సమీపంలో, నిన్న ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత, ప్రధాని మోదీ, ఇతర నాయకులు బయటకు వచ్చారు. అయితే, ఈ అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల అధ్యక్షులు తప్ప మిగిలిని వారికి ప్రవేశం లేదు. దీంతో జగన్ తో పాటు అక్కడకు వెళ్ళిన, వైసీపీ పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు లోని లైబ్రరీ హాల్ సమీపంలో లాంజ్ లో కూర్చున్నారు. సమావేసం అనంతరం మోదీ బయటకు వస్తూ ఉండటంతో, ప్రధానిని చూసిన వైసీపీ ఎంపీలు ఆయన్ను చూసి లెగిసి నుంచుని, ఆయన దృష్టిలో పడేలా తాపత్రయ పడ్డారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిన చూసిన మోడీ, హాయ్ విజయ్ గారూ అంటూ పలకరించారు. దీంతో, మోడీ తమను గుర్తించి, ఏకంగా పేరు పెట్టి పిలవటంతో, విజయసాయి రెడ్డికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి పోస్ట్ చేసారు. అఖిల పక్ష సమావేశం అనంతరం, జగన్ కోసం నిరీక్షిస్తున్న తనను చూసి, తన వైపు వచ్చి, పేరు పెట్టి పిలిచి, తనకు మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారని తెలిపారు. తన జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకమని అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. అయితే, దీని పై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తనకు ప్రధాని షేక్ హ్యాండ్ ఇవ్వటం, తన జీవితంలో మధుర జ్ఞాపకం అయితే, ఆంధప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు , విభజన హామీలు లాంటివి సాధించుకు వస్తే, అది మదుర క్షణం అవ్వాలి కాని, ఇలా ప్రధాని దృష్టిలో పడటానికి పాట్లు పడుతూ, ఆయన చేయి తగలగానే, అల్పానందం పొండి, అదేదో ప్రధాని నుంచి షేక్ హ్యాండ్ తీసుకోవటమే గొప్ప అన్నట్టు, వైసీపీ చేస్తున్న హడవిడిని ప్రశ్నిస్తున్నారు.