గత ఎన్నికల్లో, పోలింగ్ జరిగిన విధానం కౌంటింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవరం మాజీ ఎమ్మల్యే, టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఈ అవకతవకలు చాలెంజ్ చేస్తూ హైకోర్ట్ కు వెళ్లారు. ఓట్ల లెక్కింపు సమయంలో, రిటర్నింగ్‌ అధికారి చట్టానికి విరుద్ధంగా, నిబంధనలు పట్టించకుండా ప్రవర్తించిన అతని పై చర్యలు తీసుకువాలని రిట్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే, ఈ పిటీషన్ పై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వేసిన పిటిషన్‌కు విచారించే అర్హత లేదని, దాన్ని కొట్టేయ్యాలని ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. ఎలక్షన్ కమిషన్ తరుపున న్యాయవాది హై కోర్ట్ కు తన వాదనలను వినిపిస్తూ, ఓట్ల కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన పై ఏమైనా అభ్యంతరం వుంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చెయ్యాలి కాని, బొండా ఉమ రిట్‌ వేసారని, ఇది రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు విరుద్ధమని, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు అంటూ వాదనలు వినిపించారు.

దీని పై బోండా ఉమామహేశ్వరరావు తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల పిటిషన్‌ మాత్రమే వేయాలన్న ఎన్నికల సంఘం ఈసీ వాదన సరికాదన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిబంధనలను పాటించక పోవటం వలెనే రిట్ పిటీషన్ దాఖలు చేసామని, దాని పై ఈసీ అభ్యంతరం చెప్పడం వింతగా ఉందని అన్నారు. రిట్‌ దాఖలు వేయకుండా, నిషేధం ఏమి లేదని అన్నారు. రిట్‌ పిటీషన్ ను విచారించొచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హైకోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో, ఇది విచారణ అర్హత ఉందో లేదో, వచ్చే వారం తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేస్తూ, దీన్ని వాయదా వేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేసి, తీర్పును వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read