ఏపీ అసెంబ్లీ రెండో రోజు హాట్ హాట్‌గా నడుస్తోంది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్పీకర్ ఎన్నికపై ఇరు పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికారపక్షం సభా సంప్రదాయాలను పాటించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకోవడం మంచి నిర్ణయం తీసుకున్నారని భావించానని.. తమను అడిగితే పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదన్నారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా, విపక్ష నేత చంద్రబాబు రాలేదన్న సంగతి తెలిసిందే. స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు వివరణ ఇచ్చారు.

cbn 13062019 1

ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని అన్నారు. 2014లో తాము కోడెల పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. కానీ, ఈ దఫా అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే, ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని, ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.

cbn 13062019 1

గతంలో తాను సభానాయకుడిగా ఉన్నప్పుడు స్పీకర్‌ను ఎంపిక చేసిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దగ్గరకు మంత్రుల్ని పంపి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. స్పీకర్ ఎంపికపై తమకు సమాచారం ఇస్తారని చూశామని.. కానీ కనీసం ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. ఇవాళ కూడా సభకు వచ్చినప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని.. ఇష్టమైతే రండి, లేకపోతే లేదన్నట్లు వ్యవహరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమనుకుంటారన్నది ఆలోచన చేయలదేని.. ఈ విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెబుతున్నానన్నారు. తామెప్పుడూ ఏక పక్షంగా చేయలేదని.. సభా సంప్రదాయాలు ఉంటాయి.. వాటిని వైసీపీ పాటించలేదన్నారు. అయినా సరే సభకు పూర్తిగా సహకరిస్తామన్నారు బాబు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read