10 రోజుల క్రితం, కేసిఆర్, జగన్, గవర్నర్ ఇంటికి భోజనానికి వెళ్లి, హైదరాబాద్ లో ఉన్న ఎపి ఆస్థులు, తెలంగాణాకు అప్పనంగా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఒక గంట భోజనం చేసి, రాష్ట్రానికి సంబధించిన ఆస్తులు సొంత ఆస్తులు లాగా పంచేసుకున్నారు. ఏపి ఆస్తులు, తెలంగాణాకు ఇస్తున్నాం అని, ఇక్కడ ప్రభుత్వం కనీసం ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. కనీసం క్యాబినెట్ సమావేశం పెట్టి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే స్పృహ కూడా లేకుండా, సొంత ఆస్తులు అయినట్టు, ఆంధ్రుల ఆస్తులు కేసిఆర్ కు జగన్ అప్పచెప్పేసారు. అయితే, దీని పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మరో స్టొరీని వైసిపీ ప్రాచారంలోకి తెచ్చింది. భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు కేసిఆర్ అంగీకరించారని, ఇది ప్రజా విజయం అంటూ హడావిడి చేసారు. అసలు బుర్ర ఉన్న ఎవరూ, కేసిఆర్ ఇలా ఇస్తాడు అంటే నమ్ముతారు. కాని, తమకు ఉన్న చానెల్స్, పేపర్స్ సపోర్ట్ తో హడావిడి చేసారు. ప్రజలు నిజమే అని కూడా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో, తెలంగాణా మంత్రి షాక్ ఇచ్చారు.
భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే ప్రతిపాదన లేదని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల గడువున్నా హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అలాంటి ప్రతిపాదనలు ఏమీ జరగలేదని తాజాగా ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.