ఫేక్ ప్రచారంతో ఆరితేరిన ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఎవరో ఒక విలేఖరి ట్విట్టర్ లో పెట్టిన దానికి, తెలుగు మీడియా అందుకుని, ఇదే నిజం అంటూ చంద్రబాబు పై మరోసారి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. విషయంలోకి వస్తే, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రచారం చేసి.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందం చేసుకున్నారని కొన్ని తెలుగు మీడియా చానల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ధీర్ఘకాలానికి ఈ ఒప్పందం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ఈ సమాచారంలో వాస్తవం ఎంత ఉందో కూడా చూడకుండా, తెలుగు మీడియా చానల్స్ హడావిడి మొదలు పెట్టాయి. అసలు ఇది నిజమా కాదా అనేది, కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇట్టే తెలిసిపోతుంది.
ఇదంతా ఒక చిల్లర ప్రచారంగా కొట్టి పారేస్తున్నాయి తెలుగుదేశం శ్రేణులు. నిజంగా తెలుగుదేశం పీకే సేవల్ని వినియోగించుకోవాలన్నా అది ఏ 2022 సంవత్సరంలోనో మొదలవుతుంది.. ఎన్నికలకి ఏడాది ముందో రెండేళ్ళ ముందో స్ట్రాటజిక్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది.. ఫలితాలు వచ్చిన పదిరోజులకి ఏ సంస్థ కూడా పనిలోకి దిగదు అనే విషయం కూడా కనీసం గ్రహించకుండా, ఇష్టం వచ్చినట్టు కధలు అల్లేస్తున్నారు. చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నేత, విలువలు పాటించే నేత, ఇలాంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేసి, సమాజంలో కులాల మధ్యా చిచ్చు పెట్టే బ్యాచ్ ని ఎలా దెగ్గరకు రానిస్తున్నారు అనుకున్నారు ? ఎవరో ఒక చిన్న జర్నలిస్ట్ ఎదో ఒక ట్వీట్ చేస్తే, అదే వార్తగా వేసి, చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న మన తెలుగు మీడియాకు నిజంగా వందనాలు చెప్పాల్సిందే.