తిరుమల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ, ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా ధన్యవాద సభ’లో ఆయన ప్రసంగించారు. ఈ సమయంలో చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసారు. చంద్రబాబు ఎన్నికల ఫలితాలు తరువాత, చాలా ఆవేదనతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలను కలుస్తూ, ఇంత చేసినా ఓడిపోవటం బాధ కలిగిస్తుందని, ఈ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని కంటి పాపలా చూసుకున్నాను అని, ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటూ, కష్టపడినాప్రజలు ఓడించారని బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒక విధంగా 23 సీట్లు మాత్రమె వచ్చే చెత్త పరిపాలన అయితే చంద్రబాబు చెయ్యలేదు. ఇది అయానకే కాదు, ఆయన ప్రత్యర్ధులకు కూడా షాక్ కలిగించే అంశం. ఓడిపోయినా, ఇంత ఘోరంగా ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.
ఓటమి పై ఎన్ని విశ్లేషణలు చేసినా, అసలు ఇంత తిరస్కరణకు గురి అవ్వటానికి కారణం ఏంటో తెలియని పరిస్థితి. అయితే చంద్రబాబు ఇంత బాధ ఉన్నా, మీడియాతో మాట్లాడారు, ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గున్నారు, రంజాన్ సందర్బంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు, ప్రతి రోజు ప్రజలను కలుస్తున్నారు ఇలా ప్రజలతోనే ఉన్నారు. అయితే నిన్న తిరుమల వచ్చిన ప్రధాని మాత్రం, చంద్రబాబు పై దెప్పి పొడుస్తూ, పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ‘ప్రజా ధన్యవాద సభ’లో ఆయన ప్రసంగిస్తూ, "ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు బయటకు రావడం లేదు. మాకు మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది." అంటూ చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసారు. దీని పై చంద్రబాబు స్పందించే అవకాసం లేదు కాని, ఎంత మంది, ఎన్ని వైపుల నుంచి, ఎన్ని కుట్రలు చేసి, చంద్రబాబుకు ఈ పరిస్థితి తెచ్చారో, అందరికీ తెలుసు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది.