రాయలసీమలోని కర్నూలు జిల్లాను విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం జూపాడుబంగ్లా మండలం పరిధిలోని తంగడంచె మెగా సీడ్‌ పార్కును తెరపైకి తెచ్చింది. వ్యవ సాయంలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో రాష్ట్రం లోనే ఈ కేంద్రం అత్యున్నతంగా తీర్చిదిద్దాలని అప్పటి ప్రభుత్వం ఇందుకోసం కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే పనులు ప్రారంభం కాకమునుపే ఈ విత్తన సీడ్‌ పార్కు నిర్మాణం పున:సమీక్షలో పడింది. దీంతో ఈ మెగా సీడ్‌ పార్కు పనులపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇందుకు కారణం నూతన ప్రభుత్వ నిర్ణయమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల తుల్లూరులో వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులతో నిర్వహించిన సమీక్షలో కర్నూలు తంగడంచె మెగా సీడ్‌ పార్కు నిర్మాణ పనులు తెరపైకి వచ్చాయి. ఈ పార్కు పనులను తాత్కాలికంగా నిలిపివేసి అన్ని కోణాల్లో పరిశీలించిన పిదప మంచి ఆలోచనలతో తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీడ్‌ పార్కు పనులు ప్రారంభించకముందే బ్రేక్‌ పడ్డట్లు అయింది.

27 days

తంగడంచె మెగా సీడ్‌ పార్కు నిర్మాణ ఉద్దేశం వ్యవసాయ రంగంలో ఆధునిక పద్దతులతో పాటు విత్తన ఉత్పత్తిలో మేలైన రకాలు, వ్యవసాయంలో నూతన వంగడాల ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ కేంద్రాలు ఇతరత్రా వాటిని నెలకొల్పడమే ఈ మెగా సీడ్‌ పార్కును నెలకొల్పేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ చివరి బడ్జెట్‌లో ఇందుకోసం ఏకంగా రూ.620 కోట్లకు పైగా కేటాయించింది. అమెరికాలోని ఆయోవా విశ్వ విద్యాలయ సాంకేతిక పరిజ్ఞానం, సహకారంతో ఇతర ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి పరిచేందుకు రూ.315 కోట్లతో డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బోర్డును కూడా ఏర్పాటుచేసింది. ఇందుకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. అంతేకాదు ఐఎల్‌ఎస్‌ఎఫ్‌ అనే కంపెనీని ఎంపిక చేసి ఇక్కడ నిర్మాణ ఆకృతులు, కట్టడాలు చేపట్టేందుకు ఇంజనీరింగ్‌ పనుల నిర్మాణం నిమిత్తం ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. అయితే పనుల నిర్వహణకు ముందే ఎన్నికల కోడ్‌ రావడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. టెండర్లను అయితే పిలిచారు కానీ, ఎన్నికల కోడ్‌ అడ్డంకి రావడంతో పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండానే నిలిచిపోయింది.

27 days

వాస్తవంగా ఈ మెగా సీడ్‌ పార్కులో అంతర్గత రహదారుల నిర్మాణం నిమిత్తం రూ.27 కోట్లతో, విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం నిమిత్తం రూ.7.60 కోట్లతో మొత్తం దాదాపు రూ.50 కోట్లతో పనులు చేపట్టేందుకు అప్పట్లో అనుమతులు కూడా లభించాయి. ఇందులో భాగంగా ఐఎల్‌ఎస్‌ఎఫ్‌ సంస్థకు రూ.32 కోట్ల పనులు కూడా కేటాయించడం జరిగింది. ఇక భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలు, ఇతర ఆకృతుల నిమిత్తం డీపీఆర్‌ చేసినా ఆయా పనులు నిర్వహణకు ముందే బ్రేక్‌ పడింది. ఇప్పటికే తంగడంచె సీడ్‌ పార్కుకు కేటాయించిన భూముల్లో మొత్తం 170కి పైగా ఫ్లాట్ల రూపంలో గట్లను సిద్ధం చేశారు. ఈ గట్లలోనే విత్తన ఉత్పత్తి చేయాల్సి ఉంది. 2018 – 2019లో వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం 17 పంటలకు సంబంధించి 77 రకాల క్షేత్ర ప్రదర్శన కూడా నిర్వహించారు. ఇక ఇక్కడి ఫాంలో 18 నీటికుంటలను పిఎంకెఎస్‌వై పథక నిధులతో తవ్వేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, ఆయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో విత్తన ఉత్పత్తి కేంద్రం నిర్మాణంకు రూ.315.50 కోట్లతో ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి కానీ, పనులు జరగలేదు. మొత్తంగా తంగడంచె మెగా సీడ్‌ పార్కు పనులు చిన్నచిన్న పనులతోనే బ్రేక్‌ పడగా, నూతనంగా అధికారం చేపట్టిన వైఎ స్‌ జగన్‌ ప్రభుత్వం మెగా సీడ్‌ పార్కులో పనులను నిలిపివేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read