సోమవారం సీఎం జగన్ ఆధ్వర్యంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. సుమారు ఐదున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి కేబినెట్ సమావేశంలో జగన్, అటు మంత్రులకి, ఇటు అధికారులకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చారు. ముందుగా అధికారులను ఉద్దేశిస్తూ, మంత్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. తన కేబినెట్‌లో మంత్రులు డమ్మీలు కాదని, హీరోలని చెప్పారు. మంత్రులు, అధికారులు కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ మంత్రులకు కూడా సూచించారు. గతంలో ఆయా మంత్రిత్వశాఖల్లో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలని మంత్రులకు జగన్‌ సూచించారు.

cabinet 11062019

ఇక మొదటి సారి అధికారంలోకి వచ్చాం, ఆర్ధికంగా నిలదొక్కుకుందాం అని అనుకున్న మంత్రులకు జగన్ షాక్ ఇచ్చారు. "అవినీతి రహిత పాలనే లక్ష్యం. అవినీతి మరక అంటితే మందలింపులుండవ్‌. అలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించడమే. రెండున్నరేళ్లపాటు పదవికి గ్యారెంటీ ఉండదు. రాష్ట్ర మంత్రిమండలి తొలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులకు ఈమేరకు కర్తవ్యబోధ చేశారు. నా దృష్టిలో లేకుండా క్షేత్రస్థాయిలోగానీ బహిరంగంగా గానీ ఏ హామీలు ఇవ్వకండి.. అలా మీ అంతట మీరే హామీలిచ్చేస్తే వాటిని అమలు చేయలేకపోతే మీ వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ప్రభుత్వంపైనా ఆ ప్రభావం పడుతుంది అని జగన్ అన్నారు.

cabinet 11062019

"కాంట్రాక్టులు, టెండర్లు, ఇంజినీరింగ్‌ పనుల్లో అవకతవకలు జరిగి ఉంటే వాటిని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేద్దాం. న్యాయ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు ఒక న్యాయమూర్తిని నియమించాలని ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. కమిషన్‌ ఏర్పాటయ్యాక టెండర్ల వివరాలను ఆ కమిషన్‌ ముందుంచుతాం. న్యాయ కమిషన్‌ సూచనలు, సిఫార్సుల మేరకు టెండర్లు పిలుస్తాం. గత ప్రభుత్వం వారికి కావాల్సిన కొద్దిమంది గుత్తేదార్లకే కాంట్రాక్టు దక్కేలా టైలర్‌ మేడ్‌ ప్రీ క్వాలిఫికేషన్‌ సిద్ధం చేసి వాటి ఆధారంగా వారికి కావాల్సినవారికే టెండర్లు కట్టబెట్టుకున్నారు. అలాంటి అవకతవకలను చక్కదిద్దుదాం. వాటిలో వృథా అవుతున్న మొత్తాన్ని ఆదా చేసేందుకు ఆ పనులను రద్దు చేద్దాం. రివర్స్‌ టెండర్ల విధానం ద్వారా ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేసి ఎక్సెస్‌ రేట్లు రాకుండా చూస్తాం." అని జగన్ అన్నారు. అయితే ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన అందరూ, ఇలా అవినీతి లేని సమాజం నిర్మిస్తాం అని చెప్పటం, ప్రజలు అవి వినటం, మళ్ళీ వీళ్ళే అవినీతి చెయ్యటం చూస్తూనే ఉన్నారు ప్రజలు. అంతెందుకు, ఈ మాటలు చెప్పిన జగనే, అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. చూద్దాం, నిజంగా మార్పు తెస్తే మంచిదేగా...

Advertisements

Advertisements

Latest Articles

Most Read