ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, పోలవరం ప్రాజెక్ట్ అధారటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా నెమ్మదించందని, ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించండి. గోదావరిలో ప్రస్తుతం వరద లేదని, కేవలం 12,000 క్యూసెక్కుల ప్రవాహ మాత్రమే ఉందని, వరద లేని సమయంలో కూడా రక్షణ గోడ పనులు, మిగతా కాంక్రీట్ పనులు ఎందుకు చెయ్యటం లేదని, ఆ పనులు ఎందుకు మందకొడిగా సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పీపీఏ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న విజయవాడలో పోలవరం ప్రాజెక్ట్ అధారటీ చైర్మన్‌ ఆర్కే జైన్‌ ఆధ్వర్యంలో పీపీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీడబ్ల్యూసీ చైర్మన్‌ బీ.పాండ్యా, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎస్‌.కె.హాల్దర్‌, కేంద్ర జల వనరుల కమిషనర్‌ కే.వోరా, డిజైన్స్‌ సభ్యుడు మున్నీ లాల్‌, సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎల్‌ గుప్తా, వాప్కోస్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎస్‌.కె.పాఠక్‌, పీపీఏ సభ్య కార్యదర్శి పాండే, సీఈ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పీపీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జరీ చేసింది. ప్రస్తుతం గోదావరి వరద చాలా తక్కువగా ఉందని, కొన్ని రోజుల తరువాత, గోదావరికి వరద ముంపు ఉన్నందున ఎప్పటికప్పుడు, ముందస్తు సమాచారం తెప్పించుకుని విశ్లేషించి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించింది. కాఫర్‌ డ్యాంను నిర్మాణం పాక్షికంగా పూర్తి అయ్యింది కాబట్టి, దానికి రక్షణ గోడలను వెంటనే నిర్మించాలని ఏపి జల వనరుల శాఖను పీపీఏ ఆదేశించింది. సహాయ పునరావాస కార్యక్రమాల్లో వేగం పెంచాల సుచుస్తూ, సెప్టెంబరు నాటికి సహాయ పునరావాస కాలనీలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read