నోట్లు రద్దు చేసిన సమయంలో, రూ.34కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు దొరికిన పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి గుర్తున్నారా ? అప్పట్లో ఒక్క నోటు కోసం, బ్యాంకుల ముందు బారులు తీరి, లాఠీ దెబ్బలు మన లాంటి సామాన్యులు పడితే, ఇలాంటి వారికి మాత్రం ఏకంగా 34 కోట్లు కొత్త నోట్లు ఇచ్చారు. అప్పట్లో ఇది ఒక సంచలనం అయ్యింది. అయితే ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ వైసీపా పార్టీ హంగామా చేసింది. చంద్రబాబు చేసిన స్కాం డబ్బులు ఇవన్నీ అంటూ, వైసీపీ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సరైన కౌంటర్ లేక పోవటంతో, ఇది నిజం అని నమ్మినవారు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ విషయం పై ఐటి, ఈడీ కూడా శేఖర్ రెడ్డి పై కేసులు పెట్టాయి. అయితే ఇప్పుడు ఇదే శేఖర్ రెడ్డి, అమయాకుడు అని, ఆ డబ్బు అంతా అతడి కష్టార్జితం అని ఐటి, ఈడీ తేల్చాయి.
ఇక్కడ సమస్య ఈ డబ్బు ఆయన కష్టపడి సంపాదించాడా లేడా అని కాదు. ఒక్క రెండు వేల రూపాయి కాగితం కోసం ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో, శేఖర్ రెడ్డికి, 34 కోట్లకు, రెండు వేల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి అని ? కేంద్రంలో పెద్దల సహయం లేనిదే అంత డబ్బు రాదు. మరి, ఈ విషయం తేల్చకుండా, అది సక్రమ సంపాదన అని తేల్చేసారు. అయితే క్లీన్ చిట్ ఇచ్చిన వెంటనే శేఖర్ రెడ్డి , ఆంధ్రాలో వాలిపోయారు. ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండటంతో, వెంటనే ఒక అర్జీ పెట్టుకున్నారు. మళ్లీ టిటిడి బోర్డు మెంబెర్ పదవిని ఆశిస్తున్నట్లు జగన్ కు చెప్పారు. నాకు ఏ పాపం తెలియదని, నేను అమాయకుడుని అని దర్యాప్తు సంస్థలు తేల్చాయని, నాకు క్లీన్ చిట్ ఇచ్చారని, అందుకే ఇప్పుడు మళ్ళీ టిటిడి బోర్డు మెంబెర్ పదవి ఆశిస్తున్నాని, ఆ పదవి కేటాయించమని జగన్ ని కోరారు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారి వినతిని ఆమోదిస్తారో, తిరస్కరిస్తారో చూడాలి.