40 ఏళ్ళ రాజకీయ జీవితం.. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, జాతీయ స్థాయి నేతగా గుర్తింపు.. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్త గౌరవం, గుర్తింపు తెచ్చిన నేత.. మొన్న సియంగా చేసినప్పుడు, 11 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టించి, వారు గౌరవంగా బ్రతికేలా చేసారు. ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, మోడీ లాంటి బలమైన నేతలతో పోరాటం చేసిన చరిత్ర. కాని ఈ రోజు ఆయనకు జరిగిన అవమానం మాత్రం, ఎప్పుడూ జరగలేదు. 31 కేసులు ఉన్న ఒక నేతను, సియంగా ఎన్నుకున్న ఏపి ప్రజలు, ఈ రోజు చంద్రబాబుకు జరుగుతున్న అవమానాలు గమనిస్తున్నారు. చంద్రబాబు కంటే, జగన్ ఎక్కువ సేవ చేస్తారని గెలిపించారు కాని, చంద్రబాబుని ఎవరూ అవమానించిన విధంగా అవమానించటానికి కాదు. నిన్న సాయంత్రం, ప్రజా వేదికను స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పిన ప్రభుత్వం, ఈ రోజు ఉదయం వచ్చే సరికి, చంద్రబాబు సామాను అన్నీ ప్రజా వేదిక నుంచి బయట పడేసారు.
అవన్నీ వర్షంలో తడుస్తూ అలా ఉండి పోయాయి. నిన్న సాయంత్రం చెప్పారని, ఈ రోజు బయట పడేశారని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా చంద్రబాబు వాడిన సామాన్లను బయటపడేయడమేంటని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న నివాసానికి అనుబంధంగా ఉంది. ప్రతిపక్ష నేతకు నివాసం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీంతో చంద్రబాబు, ప్రజా వేదిక తన కార్యక్రమాలకు కేటాయించాలని, ప్రభుత్వానికి లేఖ రాసారు. అయితే, దీని పై ఎలాంటి నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం, నిన్న సాయంత్రం ఉన్నట్టు ఉండి, ఖాళీ చెయ్యాలని చెప్పింది. అయితే కొంచెం సమయం ఇవ్వాలని, చంద్రబాబు ఊరిలో లేని టైంలో, ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, ఆయన వచ్చిన తరువాత ఆయనకు చెప్పి, చెయ్యాలని తెలుగుదేశం నేతలు కోరగా, ప్రభుత్వం ఇవామీ పట్టించుకోకుండా, నిన్న సాయంత్రం చెప్పి, ఈ రోజు వచ్చి సామాను బయట పడేసారు.