తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్ ప్రభుత్వం పై హైకోర్ట్ లో కేసు వేసారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న తనకు, పూర్తిగా భద్రతను కుదించటం పై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది ఈ విషయం పై, హైకోర్ట్ లో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు తగ్గించిన భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు హైకోర్టును కోరారు. ఈ పిటీషన్ పై హైకోర్ట్ లో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, జగన్ ప్రభుత్వం చంద్రబాబు పై కక్ష తీర్చుకునే విధంగా, భద్రతను తగ్గిస్తూ వచ్చింది. చంద్రబాబు కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించారు. మాజీ మంత్రి లోకేష్ కు భద్రత కుదించారు. అలాగే చంద్రబాబు సొంత ఊరు అయిన నారావారి పల్లెలో ఉన్న ఆయన సొంత ఇంటికి కూడా భద్రతను తగ్గించారు. ఇక జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు, రోజుకు ఒక షాక్ ఇస్తూ, భద్రత తగ్గిస్తూ వచ్చారు.

చంద్రబాబు కాన్వాయ్ లోని ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాలను పూర్తిగా తొలగించిరు. ప్రస్తుతం చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నా, రాష్ట్ర పోలీసుల తరఫున మాత్రం భద్రతను తగ్గించారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత ఇచ్చేవారు. ప్రస్తుతం అందరినీ తొలగించి ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే కేటాయించారు. అలాగే ఎయిర్ పోర్ట్ లో చెకింగ్ పై చంద్రబాబు అభ్యంతరం చెప్పక పోయినా, అందరూ వెళ్ళే బస్ లోనే ఫ్లైట్ దాకా వెళ్ళటం పై కూడా తెలుగుదేశం వర్గాలు అభ్యంతరం చెప్తున్నాయి. భద్రతాపరంగా ఇది మంచిది కాదు అని చెప్తున్నాయి. ఇవన్నీ దృస్టిలో పెట్టుకుని, 2014కు ముందు మాజీ సీఎం హోదాలో తనకు, ఏ భద్రత అయితే ఉందో, అలాగే కల్పించాల్సిందిగా చంద్రబాబు హైకోర్టును పిటీషన్ లో కోరారు. అయితే ఈ రోజు డీజీపీ మాట్లాడుతూ, చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని, ఇంకా పెంచామని చెప్పటం, పెద్ద హైలైట్. ఇలాగే మీడియా ముందు కాకుండా, కోర్ట్ ముందు కూడా చెప్తారేమో చూద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read