తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు, రేపు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు వెళ్తున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, వాళ్ళ సమస్యల తెలుసుకోవాటానికి పర్యటన ఏర్పాట్లు చేసారు. చంద్రబాబు రాక సందర్భంలో, కుప్పం తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఈ నేపధ్యంలో, కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ బ్యానేర్లు కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, గత 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలుపుతూ, వాటి వివరాలు, ఫోటోలతో, డిజిటల్ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. పలమనేరు జాతీయ రహదారికి ఇరువైపులా, చంద్రబాబు చేసిన అభివృద్ధి తెలుపుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు.
అయితే రాత్రి 11 గంటల సమయంలో, ఇవి చూసిన వైసీపీ కార్యకర్తలు తట్టుకోలేక పోయారు. మా పాలనలో మీ సోది ఏంటి అంటూ, హంగామా చేసారు. ఇక్కడ మా జగన్ బ్యానర్లు ఉన్నాయి, అవి కనిపించకుండా, మీవి కడతారా అంటూ, చంద్రబాబు పేరుతొ పెట్టిన బ్యానర్లు అన్నీ ధ్వంసం చేసారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులకు చెప్పినా స్పందించక పోవటంతో, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ధర్నా చేశారు. తెలుగుదేశం ధర్నా చేస్తూ ఉండటంతో, వైసీపీ శ్రేణులు కూడా పోటీగా ధర్నా చేయడంతో పోలీసులు ఇరు పార్టీలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దాదాపు 3 గంటల పాటు వైకాపా కార్యకర్తల అరుపులు, నినాదాలతో ఆ ప్రదేశం అట్టుడికిపోయింది. నేషనల్ హైవే పై వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం కలిగింది.