ప్రస్తుతం కూల్చివేతల టైం నడుస్తుంది. అది కూడా ప్రత్యర్ధుల పై మాత్రమే. చంద్రబాబు కట్టిన ప్రజా వేదిక కూల్చివేతతో మొదలయ్యి, నెక్స్ట్ టార్గెట్ ఏంటా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లి కరకట్ట పై చంద్రబాబు ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చి వారంలో పడేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని 19వ వార్డులో, 2 వేల గజల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. ఇది అక్రమం అంటూ, జీవీఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లో లోపు ఆ భవనానికి సంబంధించిన, లింక్‌ డాక్యుమెంట్‌లు ఇవ్వకపోతే, భవనాన్ని కూల్చేస్తామని విశాఖ తెలుగుదేశం పార్టీ అర్బన్‌ అధ్యక్షులు ఎస్‌ఎ.రెహ్మాన్‌కు పంపిన నోటీస్ లో, జివిఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కార్యాలయం అక్రమం అంటూ వైసీపీ ఫిర్యాదు చెయ్యటం, వెంటనే జీవీఎంసీ రంగంలోకి దిగటం జరిగిపోయాయి.

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ వాదన మరోలాగా ఉంది. 2001లో నే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలంటూ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసామని, టిడిపి అర్బన్‌ అధ్యక్షులు ఎస్‌ఎ రెహ్మాన్‌ తెలిపారు. 2002లో ఆనాటి కలెక్టర్‌ నర్సింగరావు, జెసిగా ఉన్న ఎమ్‌టి.కృష్ణబాబు, రెండు వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయించారని గుర్తు చేసారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ తమ వద్ద ఉన్నాయని అన్నారు. అప్పటి తహశీల్దార్‌ ఆ స్థలాన్ని తమకు అప్పగించారని చెప్పారు. అయితే ఇప్పుడు జివిఎంసి అధికారులు రాణి కమలాదేవి నుండి ఈ స్థలానికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్‌ అడుగుతున్నారని, ఇలా ఎందుకు అడిగారో కమిషనర్‌ను కలిసిన తర్వాత, ఈ విషయం పై స్పందిస్తామని అన్నారు. అయితే ఈ స్థాలానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయని, ఇక్కడ ఏది అక్రమమ కట్టడం లేదని, జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగమే ఇదంతా అని ఆరోపిస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read