తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ వైఖరిని తప్పు బడుతున్నారు. ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎలా ముందకు నడిపిద్దామని అని చూసామే కాని, ఎలాంటి తప్పులు చేయలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ప్రభుత్వం కావటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటిని పరిష్కారం చేస్తూ, ఆంధ్రా ప్రజల మనోభావాలు కాపాడుతూ, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లానని చెప్పారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో, ఆర్ధిక పరిస్థితి ఉన్న, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రజలు ఏ కష్టం రానివ్వలేదని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్మాన్ని కాపాడామని చెప్పారు. ఏ నాడు లైన్ దాటలేదని, ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదురుకున్నామే కాని, దాడులు, కక్ష తీర్చుకోవటం వంటివి చెయ్యలేదని అన్నారు.
కాని ఇప్పుడు, తెలుగుదేశం శ్రేణులు పై దాడులు పెరిగిపోయాయి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతల పై , వైసీపీ చేస్తున్న దాడులను చంద్రబాబు ఖండించారు. కొత్త ప్రభుత్వం కాబట్టి, ఆరు నెలలు సమయం ఇచ్చి, వారి పరిపాలన చూసి స్పందిద్దామని, నిర్మాణాత్మకంగా ఉండాలని అనుకున్నామని చంద్రబాబు అన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండటం , ప్రతిపక్షంలో ఉండటం తమ పార్టీకి కొత్తేమి కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మా పైనే అవినీతి మరకలు వెయ్యాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏదైనా అవినీతి చేసమంటే, విచారణ జరుపొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా కాకుండా, ఎలా అయినా సరే, చెప్పండి చెప్పండి అంటూ, సబ్‌కమిటీ వేసి, అధికారులను అవినీతి చేస్తే సన్మానిస్తాము అని చెప్పి, ఎవరూ స్పందిచక పోవటంతో, మీలో ఎవరికీ సీరియస్‌నెస్ లేదని అధికారులను సీఎం జగన్ హెచ్చరించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎలా అయినా సరే తమ పై అవినీతి మచ్చ వెయ్యాలని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ఎందుకు ఇంత తాపత్రయం అని చంద్రబాబు అన్నారు. గత సంవత్సర కాలంగా మోడీ కూడా ఇలాగే చేసి, చివరకు అవినీతి మరక అంటించ లేకపోయారని గుర్తు చేసారు.