ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ప్రధాన సమస్య, రైతులకు విత్తనాలు అందకపోవటం. ఖరీఫ్ నెల ప్రారంభం అయ్యి నెల రోజులు అయినా, ఇప్పటికీ రైతులకు విత్తనాలు, ఎరువులు అందలేదు. ఈ సమయానికి పొలాల్లో ఉండాల్సిన రైతన్న, రోడ్డు పై విత్తనాల కోసం ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, ఎలాంటి విత్తన కష్టాలు లేవు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే, రైతులకు విత్తనాలు అందేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మళ్ళీ ఈ విత్తన సమస్య మొదటికి వచ్చింది. రైతులు ఇంత ఆందోళన చెందుతున్నా, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం పెద్దగా స్పందన లేదు. అయితే ప్రస్తుతం, రాష్ట్రంలో ఉన్న విత్తన సమస్యల పై, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. రాష్ట్రంలో ఉన్న విత్తన కొరతకు, రైతులు పడుతున్న ఇబ్బందికి చంద్రబాబే కారణం అని ధ్వజమెత్తారు. జూన్‌ 8దాకా తానే సియంను అని చెప్పిన చంద్రబాబు, ఖరీఫ్ పంటకు విత్తనాలు సేకరించాలేదని, అన్నారు.

విత్తనాలు కొనకుండా, ఆ డబ్బు అంతా వివిధ పధకాలకు మళ్ళించారని, అందుకే ఈ కష్టాలని అన్నారు. చంద్రబాబు విత్తన సేకరణకు డబ్బులు ఇవ్వలేదని, జగన్ మాత్రం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇచ్చారని కన్నబాబు చెప్పారు. విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, త్వరలోనే ఈ కష్టాలు మా జగన్ తీర్చేస్తారని చెప్పారు. ఈ నెల 12 దాకా విత్తనాలు పంపిణీ చేస్తామని, రైతులు విత్తనాలు తీసుకోవచ్చని చెప్పారు. అయితే, ఇక్కడ రైతులు మాత్రం, చంద్రబాబుని నిందించటం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఓట్లు వేసింది, పని చెయ్యటానికి అని, చంద్రబాబుని నిందించటానికి కాదని అన్నారు. జగన్ రాగానే డబ్బులు విడుదల చేస్తే, ఈ కష్టాలు 40 రోజులు నుంచి ఎందుకు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు చెయ్యకపోతే, 45 రోజుల నుంచి మీరు ఏమి చేస్తున్నారు అంటూ, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ నెల పోయింది అని, వారంలో కనుక విత్తనాలు ఇవ్వకపోతే, ఈ సారికి క్రాప్ హాలిడే తీసుకోవటమే అని రైతులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read