తెలుగుదేశం పార్టీ పై బీజేపీ తన పగ తీర్చుకుంటుంది. ఎన్నికల ముందు వరకు రాష్ట్ర హక్కుల కోసం, చంద్రబాబు దేశ వ్యాప్తంగా తిరిగి, మోడీ పరువు తీసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని దేశమంతా తిరిగి చెప్పారు. దీంతో ఎలా అయినా చంద్రబాబుని ఓడించాలాని ప్లాన్ చేసి, జగన్ కు మద్దతు ఇచ్చి, అన్ని వ్యవస్థలు తమ ఆధీనంలో ఉండటంతో, చంద్రబాబుని ఓడించి, జగన్ ను గెలిపించారు. ఇప్పుడు తెలుగుదేశం బలహీనంగా ఉండటంతో, ఇదే అదనుగా, పార్టీలోని నాయకులు అందరినీ లాగేసే ఎత్తు వేసింది బీజేపీ... ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టటానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని, వైసీపీ జోలికి వెళ్ళకుండా, తెలుగుదేశం నాయకులను లాగి, బలపడాలని చూస్తుంది. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీ నేతల్ని ఒక్కొక్కరిగా తమవైపు తిప్పుకుంటుంది. పోయిన వారం నలుగురు రాజ్యసభ ఎంపీలని లాక్కొన్ని, రాజ్యసభలో బలం పెంచుకుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా తమ వైపు లాక్కునే ప్లాన్ వేసింది.
ఇందులో భాగంగా, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయనతో పాటూ పార్టీ అధికార ప్రతినిధి వ్యవహరిస్తున్న లంకా దినకర్ కూడా బీజేపీలోకి వెళ్తునట్టు సమాచారం. వీరు ఇద్దరూ, ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల టీడీపీని వీడిన ఎంపీ గరికపాటితో, వీరిద్దరినీ బీజేపీ పెద్దలు దగ్గరకు తీసుకువెళ్ళి డీల్ సెట్ చేసినట్టు సమాచారం. అనగాని సత్యప్రసాద్ రేపల్లె నంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. 2014లో కూడా సత్యప్రసాద్‌కు టీడీపీ తరపున, రేపల్లె టికెట్ కేటాయించారు. అప్పుడు కూడా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో కూడా తిరిగి రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీచేసి, మళ్లీ మోపిదేవిపై గెలిచారు. సినీ నటి సామంత కూడా ఈయన తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. అయితే వీరు పార్టీ మారితే, అన్ని నీతులు చెప్పిన జగన్, స్పీకర్ చేత వీరి పై అనర్హత వేటు వేస్తారో, లేక బీజేపీ నుంచి వచ్చే ఆదేశాలకు తల వంచేస్తారో తెలిసి పోతుంది.