ఎప్పుడూ బాలన్స్ తప్పకుండా, చంద్రబాబు లాగే హుందాగా రాజకీయం చేసే మాజీ మంత్రి లోకేష్, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి సమాధానం ఇస్తూ, చాలా అగ్రెసివ్ గా రిప్లై ఇచ్చారు. చంద్రబాబు హయంలో అవినీతి చేసారని ఆరోపణలు చేస్తూ వస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, అది నిరూపించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఉద్యోగస్తుల దగ్గరకు వెళ్లి, చంద్రబాబు అవినీతి మీకు తెలిస్తే చెప్పండి, మిమ్మల్ని సన్మానం చేస్తాను అంటూ జగన్ చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏదొకటి చెయ్యాలని, ప్రజా వేదిక అక్రమ కట్టడం అంటూ దాన్ని కూల్చి చంద్రబాబు పై నెపం నెట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆయన తేల్చేసి, కేబినెట్ సబ్ కమిటీ అంటూ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారిని వేసి, చంద్రబాబు అవినీతి చేసారు అని తేల్చండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన 30 అంశాల పై విచారణ చేయాలని, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అన్ని సంస్థల సహకారం తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

జగన్ చేస్తున్న ఈ పనుల పై, తెలుగుదేశం నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎంత తవ్వినా, మీకు చీమ కూడా దొరకదని, నరేంద్ర మోడీ గత ఏడాది కాలంగా, పిఎంఓ అధికారుల చేత వివిధ విచారణలు చేపించి, చంద్రబాబుని ఇరికించటానికి చూసి, విఫలం అయ్యారని గుర్తు చేస్తున్నారు. మరో పక్క ఇదే విషయం పై లోకేష్ ఘాటుగా ట్వీట్ చేసారు. ఇది లోకేష్ ట్వీట్ "జ‌గ‌న్ గారూ ! అక్ర‌మ ఆస్థుల కేసుల్లో మీ పై లెక్క‌లేనన్ని చార్జిషీట్లు ఉన్నాయి. నిందితుడిగా జైలులో ఉండి, బెయిల్ పై బయట ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌! మీ బాబు, మా బాబు పై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు" అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అప్పటి కమిటీల వివరాలు కూడా పోస్ట్ చేసారు. సభాసంఘం వేసి 14 ఎంక్వైరీలు , న్యాయ విచారణ అంటూ 4 ఎంక్వైరీలు, మంత్రివర్గ ఉప సంఘం అంటూ 3ఎంక్వైరీలు, సీనియర్ ఐఏఎస్ అధికారుల చేత 4 ఎంక్వైరీలు, సీబీసీఐడీ విచారణ పేరుతో ఎంక్వైరీలు, ఇలా మొత్తం 26 విచారణ కమిటీలు వేసి, రూపాయి అవినీతి కూడా నిరూపించ లేకపోయారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read