ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, అన్ని రకాలుగా పెడుతున్నారు. అసలు రాష్ట్రంలో అక్రమ కట్టడాలే లేవు అన్నట్టు, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని, రెచ్చిపోతున్నారు. 2003లో చంద్రబాబు దయ తలచకపోతే, వైఎస్ఆర్ కు ఉండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు. కాని చంద్రబాబు ఎప్పుడూ కక్ష పూరితంగా వెళ్ళ లేదు. తన సహచరుడుగా, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కు గౌరవం ఇచ్చారు. తరువాత వైఎస్ఆర్ సియం అయిన తరువాత, రాజకీయంగా ఇబ్బంది పెట్టారు కాని, ఎప్పుడూ పర్సనల్ గా చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేదు. అలాగే చంద్రబాబు కూడా 2014లో సియం అయిన తరువాత, రాజకీయంగా జగన్ పై విమర్శలు చేసారు కాని, ఏ నాడు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు. కాని జగన్ మాత్రం, నెల రోజుల్లోనే తనకు ఉన్న ఫ్యాక్షన్ బుద్ధి బయట పెట్టారు. చంద్రబాబుకు భద్రత తగ్గించటం దగ్గర నుంచి నేటి దాకా, హేళన చేస్తూనే ఉన్నారు. ప్రజా వేదికను తన ఆఫీస్ గా వాడుకుంటానని, ప్రతిపక్ష నేత హోదాలో, చంద్రబాబు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

ఇప్పుడు అదే ప్రజా వేదిక విధ్వంసం దాకా వెళ్ళింది. చంద్రబాబు అడగకుండా ఉంటే, దాని గురించి పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు చంద్రబాబు అడగటం, దానికి ఏ సమాధానం ఇవ్వాలో అర్ధం కాక, అంత పెద్ద బిల్డింగ్ ని రాత్రికి రాత్రి కూల్చేసారు. దాని పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబుని ఆ నివాసంలో కూడా లేకుండా ప్లన్ చేసారు. దీంతో ప్రజావేదిక వివాదంలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. చంద్రబాబు నివాసానికి వెళ్ళాలి అంటే, ప్రజా వేదిక రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రజా వేదిక కూల్చేసారు కాబట్టి, ఆ రోడ్డు కూడా కూల్చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త పల్లవి అందుకున్నారు. ఆ స్థలం రైతులు, చంద్రబాబు అధికారంలో ఉండేంత వరకు ఈ స్థలం వాడుకోండి, తరువాత మాకు ఇచ్చేయండి అంటూ చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కట్టడాలు కడితే, చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరుకే అనే ఒప్పందం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు ఉండేది లింగమనేని గెస్ట్ హౌస్ లో, ఒక వేల ఏమన్నా ఒప్పందం ఉంటే, ఆ యజమానితో చేసుకుంటారు కాని, అక్కడ అద్దెక ఉండే చంద్రబాబుతో ఎందుకు చేసుకుంటారు ? మొత్తానికి చంద్రబాబు ఇంటికి వెళ్ళటానికి రోడ్ కూడా లేకుండా చేసి, ఆయన్న మరింత ఇబ్బంది పెట్టే ప్లాన్ వేసారు. మొత్తానికి వర్షాభావం, కరెంట్ కష్టాలు, అన్నదాతల విత్తన కష్టాలు నుంచి, సమర్ధవంతంగా ప్రజల ద్రుష్టిని మళ్ళించారు అని మాత్రం చెప్పుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read