నిన్న మంగళగిరిలో జరిగిన, టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో, ఈ రోజు కొత్త ట్విస్ట్ నెలకొంది. హత్య చేసిన వైసీపీ నేత మంగళగిరి పోలీసుల ఎదుటలొంగిపోయారు. వైసీపీ నేత తోట శ్రీనివాసరావుతో పాటు అతని ఐదుగురు అనుచరులు ఈ రోజు పోలీసులు ముందు లొంగిపోయారు. నిన్న రాత్రి రాజధాని ప్రాంతంలోని, మంగళగిరిలో జరిగిన దారుణ హత్యతో ఒక్కసారి ప్రజలు ఉలిక్కి పడ్డారు. గత 5 ఏళ్ళలో ఎప్పుడూ లేని సంస్కృతీ ఈ రోజు కనిపించటంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పరులు భయం భయంగా గడుపుతున్నారు. నిన్న దారుణ హత్యకు గురైన మంగళగిరి టిడీపీ నేత ఉమా యాదవ్ హత్య పై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న మంగళగిరి పట్టణంలో, జనం ఉండానే, నాలుగు రోడ్ల జంక్షన్‌లోనే దారుణ హత్యకు గురి కావడం కలవరం రేపింది. కసి తీరా నరికి నరికి చంపారు. ఈ హత్య చేసింది స్థానిక వైసీపీ నాయకుడు అంటూ, అతని ఇంటి పై టీడీపీ కార్యకర్తలు దాడి చసే, ప్రయత్నం చేయటంతో,నిన్న రాత్రి అంతా ఉద్రిక్తత కొనసాగింది.

పోలీసుల చెప్పిన దాని ప్రకారం, చనిపోయింది మంగళగిరి ఇందిరానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమా యాదవ్‌. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. మంగళగిరిలో గౌతమబుద్ధ రోడ్డు దగ్గరలోని తన ఆఫీస్ నిర్మాణ పనులను ముగించుకుని నిన్న రాత్రి 8:20 సమయంలో, దగ్గరలోని ద్వారకానగర్‌లోని తన స్వగృహానికి బయల్దేరారు. అతని స్నేహితుడు శ్రీకాంత్‌ బండి నడుపుతుండగా, ఈయన వెనుక కూర్చొన్నారు. ఇంటికి సమీపంలోకి రాగానే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డు రావటంతో బండి స్లో చేశారు. ఇంతలో వెనుక నుంచి మరో ఇద్దరు కత్తులు, గొడ్డళ్ళతో వచ్చి ఉమా యాదవ్‌ తలపై వేటు వేసారు. అతను అప్పటికే కింద పడిపోయినా, ఏ మాత్రం కనికరం లేకుండా, నరుకుతూనే ఉన్నారు. క్రూరంగా నరకటంతో, ఉమా యాదవ్‌ స్పాట్ లోనే మృతి చెందాడు. అయితే ఈ హత్య పై తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే 140 దాడులు చేస్తి, 8 మందిని చంపేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు ఈ దాడులను నివారించాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read