ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ రోజు తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో పర్యటిస్తున్నారు. గురువారం హిందూపురం వచ్చిన బాలకృష్ణ లేపాక్షిలో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటూ బాలకృష్ణ హిందూపురంలో పర్యటించనున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవటంతో పాటు, తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం అయ్యి, పార్టీ బలోపేతం కోసం చెయ్యవలసిన కార్యక్రమాల పై సమావేశం కానున్నారు. ఈ రోజు లేపక్షిలో, పిల్లలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గున్న బాలయ్య, పలు వ్యాఖ్యలు చేసారు. బడిబాట కార్యక్రమాన్ని ఎంత తోదరగా వీలైతే అంట తొందరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన పనులు గుర్తు చేసారు. చదువుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని చెప్తూ, జగన్ ని కూడా అవి కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా, బాలయ్య మాట్లాడుతూ ఉండగా కరెంటు పోయింది. దీంతో బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. ఓహో... ఇదా ఈ ప్రభుత్వ పాలన తీరు అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. తెలుగుదేశం పాలనలో కరెంటు కోత అనేది లేకుండా చేసామని, ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. ఇక్కడే కాదని రాష్ట్రం మొత్తం కరెంట్ కోతలు వేధిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విత్తనాల కొరత, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇది వరకు ఈ సమస్యలను చంద్రబాబు అధిగమించారని, ఇప్పుడు మళ్ళీ ఈ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు చేస్తుందని ప్రకటించండని, మన హిందూపురం నియోజకవర్గాన్ని, హిందూపురం జిల్లాగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరతా అని పేర్కొన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకూ, రాయలసీమ అభివృద్ధికి పాటుపడుతూ, ఆ దిశగా పని చేస్తానని అన్నారు.