ఈ రోజు మధ్యానం నుంచి టీవీ చానల్స్ లో, తెలుగుదేశం నుంచి గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికైన వల్లభనేని వంశీ, పార్టీ మారుతున్నారని, ఆయన బీజేపీలో చేరుతున్నారని, పెద్ద ఎత్తున టీవీ చానల్స్ లో ప్రచారం జరిగింది. ఈ రోజు చంద్రబాబుతో జరిగిన సమావేశానికి, కొన్ని కారణాల వల్ల వంశీ రాకపోవటంతో, ఆయన పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే, ఈ విషయం పై వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ వీడుతున్నాను అంటూ వచ్చే వార్తలు అన్నీ అవాస్తవం అని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సుజనా చౌదరితో తాను మాట్లాడి, బీజేపీ లో చేరుతున్నాని ప్రచారం చేస్తున్నారని, తాను అసలు సుజనాతో టచ్ లో లేరని చెప్పారు. ఆయనతో బంధుత్వం ఉన్న మాట వాస్తవమే కాని, అంత మాత్రం, పార్టీ మారిపోతారని ఎలా అనుకుంటారని వంశీ అన్నారు. ఇలాంటి వార్తలు చూసి కార్యకర్తల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంశీ అన్నారు.

16 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం అంతా, వైసీపీ, బీజేపీ పార్టీల మైండ్‌ గేమ్‌ అని వంశీ కొట్టిపారేశారు. తాను ఎప్పటికప్పుడు చంద్రబాబుతో, టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నానని, ఎవరూ పార్టీ మారే ఆలోచన లేదన్నారు. ఆ 16 మంది పేర్లు ఏమిటో, వైసీపీ, బీజేపీ చెప్పచ్చు కదా అని వంశీ డిమాండ్ చేసారు. మరో పక్క, పార్టీ మార్పు పై వస్తున్న వార్తల పై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని అన్నారు. నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఇలాంటి వార్తలు వచ్చాయని, ఇవన్నీ అవాస్తవం అని అన్నారు. తాను కొలంబోలో క్యాంప్ పెట్టాను అంటూ తప్పుడు ప్రచారం చేసారని, తాను కొలంబో వెళ్ళింది అక్కడ శక్తి పీఠాన్ని దర్శించుకోవడం కోసమని, నాతొ పాటు ఏ ఎమ్మల్యే రాలేదని, ఇలాంటి వార్తలు నమ్మవద్దని గంటా అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read