సరిగ్గా వారం క్రితం ఉన్నట్టు ఉండి, ప్రజా వేదిక వద్దకు వచ్చి, ఈ బిల్డింగ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఖాళీ చెయ్యండి అంటూ, తెలుగుదేశం అధినేతకు, అధికారులు వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్లారు. అలా సాయంత్రం వచ్చి చెప్పారో లేదో, తెల్ల వారే సరికి చంద్రబాబు సామాన్లు అన్నీ రోడ్డున పడేసారు.ఇక తరువాత రోజు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ అక్కడే జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటూ, ప్రజా వేదికను కూల్చి పడేయండి అంటూ జగన్ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలు సరిగ్గా పాటించకుండా, ప్రజా వేదిక కట్టారని, దాన్ని రెండు రోజుల్లో కూల్చి వేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా, రాత్రికి రాత్రి జనాన్ని తీసుకువచ్చి కూల్చి వేసారు. అయితే ఇంతటితో వీరు శాంతించలేదు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లుని కూడా టార్గెట్ చేసారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూల్చి, ఆయన్ను మరింత అవమాన పరిచే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ క్రమంలో, ఆయన ఇంటి జోలికి మాత్రమే వెళ్తే ఇబ్బంది వస్తుందని గ్రహించి, మిగతా వారికి తూతూ మంత్రంగా వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ జోలికి వెళ్తే ఏమి అవుతుందో జగన్ కు బాగా తెలుసు.

ఈ నేపధ్యంలో, మొదటిగా చంద్రబాబు ఇల్లుని టార్గెట్ చేసారు కాబట్టి, ఆయన ఉంటున్న ఇల్లుకే ముందుగా నోటీసులు ఇచ్చారు. ఉండవల్లి కరకట్ట పై ఉన్న ఆయన నివాసానికి ఈ రోజు ఉదయం సీఆర్డీఏ అధికారులు వచ్చారు. ఈ నోటీసులు ఇవ్వటానికి, సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, చంద్రబాబు నివాసం దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేసి, దీన్ని పడగొట్టాలని, లేకపోతే మేమే వచ్చి కూల్చేస్తామని నోటీసులో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఏ విషయం చెప్పాలని, నోటీసులకు వివరణ ఇవ్వకపోతే మేమే వచ్చి కూల్చేస్తామని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందినది. అయితే అధికారులు కేవలం చంద్రబాబు ఉంటున్న ఇంటికే నోటీస్ ఇచ్చారా, మిగతా వాటికి కూడా ఇచ్చారా అనేది తెలియదు. ఏది ఏమైనా, మరో వారం రోజుల్లో, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తారు అనేది స్పష్టం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read