ఎప్పుడు వార్తల్లో ఉండే వైసీపీ నేత రోజాకు దక్కే పదవి ఏంటి? సీఎం జగన్ ఆలోచన ఏంటి? జగన్ ఇచ్చిన ఆఫర్‌ను రోజా కాదన్నారా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయమైంది. అదే సామాజిక వర్గం... అదే జిల్లాకు చెందిన రోజాకు అవకాశం లేనట్లేనా? రోజాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండగలరా. నిజానికి కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న టైంలో సీఎం జగన్ తన పార్టీ కీలక నేత రోజాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో రోజా జుగుబ్సాకరమైన ప్రవర్తనకు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటంతో రోజాని సస్పండ్ చేసారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అందువల్ల అదే చంద్రబాబు ద్వారా అధ్యక్షా అని పిలిపించుకునేందుకు రోజాకు స్వీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ సాగింది. చంద్రబాబుని మరింత బాధపడాలి అంటే, రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి ఆ విషయమై ఆమెతో చర్చించారు. అయితే రోజా మాత్రం, తనకు స్పీకర్ పదవి వద్దని, మంత్రి పదవి కావాలని, జగన్ కు చెప్పి వచ్చినట్టు సమాచారం,
చిత్తూరు జిల్లా నుంచీ సీనియర్ ఎమ్మెల్యే... తొలి నుంచీ వైసీపీకి ఆర్థికంగా... రాజకీయంగా అండగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటూ... కీలక శాఖ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే చిత్తూరు జిల్లాకు... అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వటానికి ఈ సమీకరణలు అడ్డుగా మారాయి. దీనికి తోడు జిల్లాలో తన ప్రాధాన్యం ఉండాలని పెద్దిరెడ్డి కోరుకుంటున్నారు. జగన్ సైతం పెద్దిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. దీంతో... ఆమెకు గుర్తింపు ఇస్తూ నే కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో చిత్తూరు నుంచీ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజా విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉన్నారు.
జగన్ రాజీ ఫార్ములా ఏంటి? : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి... ఆయన కొడుకు మిధున్ రెడ్డికి లోకసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా అవకావం ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందీ స్పష్టం చేసారు. ఇదే సమయంలో మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదనీ... పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కి తెలుసని రోజా అన్నారు. జగన్ సైతం రోజాకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ రోజు రోజాకు ఇవ్వబోయే పదవి గురించి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు.