జగన్ ప్రభుత్వానికి, కేంద్రం మొట్టమొదటి షాక్ ఇచ్చింది. అంత దూకుడు వద్దు, తగ్గండి అన్నట్టుగా, ఘాటుగానే బదులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పున పరిశీలన పారిశ్రామికాభివృద్ధికి మంచి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ తో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని, అలాంటి వాటిపై పునపరిశీలన దేశ పారిశ్రామికాభివృద్ధిని దెబ్బతీస్తుందన్నారు. ఒప్పందాల పునపరిశీలన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడేలా చేస్తుందనన్నారు. రాష్ట్ర-దేశ భవిష్యత్తుకి ఇది మంచిది కాదని లేఖలో ఆనంద్ కుమార్ కొత్త ముఖ్యమంత్రికి ఈ వాస్తవాలు అర్థమయ్యేలా వివరించాలని సీఎస్ కు సూచించారు.

letter 08062019 2

రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ తేడాగా ఉన్నాయని, వాటిల్లో అవినీతి జరిగిందని, చంద్రబాబుని ఇరికిద్దామని కొత్త ప్రభుత్వం అనుకుంది. దీనికి తగ్గట్టే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పున పరిశీలన చెయ్యాలని జగన్ భావించారు. అయితే, కేంద్రం మాత్రం, ఈ విషయం పై ఒప్పుకోలేదు. రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ నిబంధనలకు లోబడి పారదర్శకంగానే జరిగాయి, ఇలాంటి పనులు చెయ్యకండి, మీ కొత్త సియంకు చెప్పండి అంటూ, చీఫ్ సెక్రటరీకి ఘాటు లేఖ పంపింది కేంద్రం. ఇలా పీపీఏలను సమీక్షించడం మొదలుపెడితే అది దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకం, ఇన్వెస్టర్ల విశ్వాసం పోయిందంటే కష్టం, మనం 2022కల్లా 175 గిగావాట్ల సంప్రదాయేతర కరెంటు టార్గెట్ పెట్టుకున్నాం, ఒప్పందాలు అన్నీ చూసుకునే చేసాం అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read