నిన్న రాత్రి టిడిపి అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ కు లోనయ్యి, విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. రాత్రి 7 గంటలకు విమానం గన్నవరం నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 9.20 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్‌ అయింది. దీంతో హైదరబాద్ వెళ్ళాల్సిన విమానం, బెంగళూరు వైపు వెళ్ళటంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంచెం సేపటి తరువాత, విషయం తెలియటంతో, చంద్రబాబు సేఫ్ గా బెంగుళూరు లో ల్యాండ్ అయ్యారని తెలిసి, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

flight 07062019

ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న విమానం అర్ధరాత్రి 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. గురువారం రాత్రి 7.20 గంటలకు చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌ ఎయిరిండియా విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. వాతావరణం ప్రతికూలంగా మారడంతో వారు ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. దీంతో రాత్రి 9.20 గంటలకు విమానం బెంగళూరుకు చేరుకుంది. అనంతరం చంద్రబాబు, లోకేశ్‌ కొద్దిసేపు అక్కడే ఉన్నారు. వాతావరణం అనూకూలించడంతో రాత్రి 10.30 గంటలకు విమానం బయలుదేరింది. దాదాపు 7 గంటల ఆలస్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్టయింది.

flight 07062019

మరో పక్క, గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆయనను కలవడానికి ఉండవల్లిలోని నివాసానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల తీరుపై కొందరు కన్నీళ్లు పెట్టుకొన్నప్పుడు చంద్రబాబు వారిని అనునయించారు. ‘మనం మంచే చేశాం. ఎవరికీ చెడు చేయలేదు. ఫలితం ఇలా వచ్చింది. అయినా బాధపడకుండా ముందుకు నడవాలి. మనకు దూరమైన వారిని దరి చేర్చుకోవాలి’ అని వారితో అన్నారు. ‘అనంతపురం, కడప వంటి దుర్భిక్ష ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరాయంటే మీ శ్రమే దానికి కారణం. మీ పట్టుదలను ప్రజలు మర్చిపోరు’ అని కొందరు రైతులు, బాబుతో అన్నారు. ‘మీ శ్రమ, దార్శనికత గురించి మేం విదేశాల్లో కూడా గర్వంగా చెప్పుకొంటాం. మీ స్ఫూర్తితోనే బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాం’ అని కొందరు ప్రవాసాంధ్ర యువకులు చంద్రబాబుతో చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read