వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ నెల రోజులల్లో 140 రాజకీయ దాడులు జరిగాయి. 7 గురు చనిపోయారు. అయితే వైసీపీ ఆగడాలు తెలుగుదేశం పార్టీ వరకే ఆగలేదు. ఏకంగా జర్నలిస్ట్ లను బెదిరిస్తూ, చంపేస్తాం అంటూ లొంగదీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో హోం మంత్రి గారు మాత్రం, మేము అందరికీ కాపలా ఉండలేము, ఘటన జరిగిన తరువాత వస్తే న్యాయం చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. హోం మంత్రే ఇలా మాట్లాడటం చూస్తుంటే, ఇలాంటి రౌడీ మూకలకు లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. ఈ రోజు తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే, ఒక జర్నలిస్ట్ ను బెదిరిస్తున్నారు. ఇదే విషయం ఆడియోతో సహా తెలుగుదేశం మాజీ మంత్రి నారా లోకేష్, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని, దానికి ఇదే ఉదాహరణ అంటూ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్న ఆడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదని, ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు.
ఈ బెదిరిపులకు సంబంధించి ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి విన వద్దు, ఇందులో అసభ్య పదజాలం ఉన్నయాని లోకేష్ ట్విట్టర్ లో పెర్కున్నారు. నడిరోడ్డుపై నరికేస్తా అంటూ బూతులతో విరుచుకు పడ్డారు కోటం రెడ్డి. అయితే ఈ విషయం పై , కోమటి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఈ ఆడియో నాది కాదు అని వాదిస్తారో, లేక అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్తారో వేచి చూడాలి. మరో పక్క, ఆ విలేఖరి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు మీడియాకు తెలిపే అవకాశం ఉంది. అయితే ఇలా ఒక అధికార పార్టీ ఎమ్మల్యే నరికేస్తా, పొడిచేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ, మేకలను చంపినట్టు, నడి రోడ్డు పై జరుగుతున్న మర్డర్లు చూసి ప్రజలు భయపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎమ్మల్యేలే ఇలా చెయ్యటం, హోం మంత్రి ఏమో ఘటన జరిగిన తరువాత కంప్లైంట్ ఇవ్వండి, అందరికీ కాపలా ఉండలేం అని చెప్పటం చూస్తుంటే, ఈ రాష్ట్రం ఎటు పోతుందో అర్ధమవుతుంది.