ప్రజా వేదిక కూల్చివేత పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ప్రభుత్వం ఇప్పుడు ద్రుష్టి మరలచటానికి, కరకట్ట పై ఉన్న వివధ కట్టడాల వారికి నోటీసులు ఇస్తుంది. ప్రజల వినతులు వినటానికి, ప్రజా వేదికను ప్రతిపక్ష హోదాలో ఉన్న తనకు ఇవ్వమని చంద్రబాబు అడగటంతో, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక, అది అక్రమ కట్టడం కూల్చేస్తున్నాం అంటూ అనుకున్నదే ఆలస్యం, కూల్చిపడేసింది. ఇప్పుడు పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేసి చంద్రబాబు పై కక్ష సాధింపు ధోరణితో వెళ్ళాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు కరకట్టపై పై చంద్రబాబు ఇంటికి వెళ్ళిన అధికారులు, ఇది అక్రమ కట్టడం దీన్ని వారం రోజుల్లో ఖాళీ చెయ్యండి అంటూ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇంటికి మాత్రమే వెళ్తే కక్ష సాధింపు అనుకుంటారని, మిగతా కట్టడాలు ఉన్న వారి ఇళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే నోటీసులు ఇవ్వటానికి వెళ్తున్న సీఆర్డీఏ అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో, ఎలాగు వచ్చాం కాబట్టి నోటీస్ అంటించి వెళ్తున్నారు.
కరకట్ట పై నోటీసులు ఇవ్వటానికి, ఏ ఇంటికి వెళ్లినా, తమ కట్టడాలకు అనుమతులు ఉన్నాయంటూ, వారి ఇంటి గేట్ల ముందు బోర్డులు పెట్టుకున్నారు. ఆ బోర్డులు చూసిన అధికారులు అవాక్కయి, ఏమి చెయ్యాలో అర్ధం కాక, తెచ్చిన నోటీసులను అంటించి వెళ్తున్నారు. అయితే అసలు వీరికి అనుమతులు ఎప్పుడు వచ్చయి, ఎలా వచ్చాయి, ఎవరు వీరికి అనుమతి ఇచ్చారు, ఏ ప్రభుత్వ హయాంలో అనుమతి ఇచ్చారు అన్న ప్రశ్నల కోసం, ఇప్పుడు అధికారులు పాత ఫైళ్లను తిరగేస్తున్నారు. సీఆర్డీఏ ఏర్పడక ముందే, వీటిలో కొన్నిటికి విజయవాడ వుడా నుంచి, కొన్ని పంచాయతీ నుంచి అనుమతులు ఇచ్చి ఉంటారని, భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, చందబాబు ఇంటిని మాత్రం వదలటం లేదు. ఆయన్ను ఎలా అయినా ఇంటి నుంచి గెంటటానికి, నోటీసులు ఒక్కటే కాదు, ఆయన ఇంటిని కొలతలు తీసుకోవాలని, ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా మరింత ఒత్తిడి చంద్రబాబు పై పడుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని సర్వేయర్లతో కొలతలు తీయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.