నిన్న కాక మొన్న, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. చంద్రబాబు హయంలో, వైద్యరంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ స్థానంలో ఉందని. ఆ రిపోర్ట్ చూసి మురిసిపోతూ, ఇప్పుడు చంద్రబాబు లేరు కదా, మన వైద్య రంగం పరిస్థితి ఏంటి, వచ్చే సంవత్సరం నాటికి మన ర్యాంక్ ఎంత అనుకునే వారికి, ఇది నిజంగా షాకింగ్ న్యూస్. చంద్రబాబు రెండవ స్థానంలో పెడితే, జగన్ దాన్ని మొదటి స్థానంలో పెడతారు అని అందరూ ఆశించారు. కాని కింద స్థాయిలో పరిస్థితి అప్పుడే మారిపోయింది. సిబ్బందికి నిర్లక్ష్యం అనే జబ్బు మళ్ళీ అందుకుంది, దీంతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఘటన, దాన్ని కప్పిపుచ్చటానికి వారు వేసిన వేషాలు చూస్తే, ఎవరికైనా కోపం రాక మానదు. తాడిపత్రి పట్టణానికి చెందిన అక్తర్‌ భాను, పురిటి నొప్పులతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సాయంత్రానికి సిజేరియన్‌ చేసారు. అయితే రక్తం కౌంట్ తక్కువగా ఉండటంతో, ఒక బాటిల్‌ రక్తాన్ని ఎక్కించాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే రక్తం ఎక్కిస్తూ ఉండగానే, శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. దీంతో రక్తం ఎక్కించటం ఆపేసారు. అయితే కొద్ది సేపటికే ఆ బాలింత చనిపోయింది. బంధువులు గొడవ చేసారు. ఆమె గుండెపోటుతో చనిపోయింది అని నమ్మించి పంపించి వేసారు హాస్పిటల్ సిబ్బంది. అయితే అనుమానం వ్యక్తం చేస్తూ, పత్రికల్లో కధనాలు రావటంతో, జిల్లా కలెక్టర్ నేరుగా హాస్పిటల్ కు వచ్చి ఎంక్వయిరీ మొదలు పెట్టారు. అయితే ఆమె రక్తం బీ పోజిటివ్ అంటూ వేరే శాంపిల్స్ చూపించి కలెక్టర్ ను కూడా నమ్మించారు. అయినా కలెక్టర్ కు ఎదో అనుమానం వెంటాడుతూనే ఉంది. వేరే పని ఉండటంతో, నగర పాలక సంస్థ కమిషనర్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసు షీటు లోతుగా పరిశీలించారు. నిపుణులను పిలిపించి క్రాస్ వెరిఫై చేసారు. అయితే ఆమె కేస్ షీట్ లో ఓ ఉన్న బ్లడ్ గ్రౌండ్, బీ గా దిద్ది ఉండటాన్ని చూసారు. దీంతో మరింత లోతుగా అన్నీ విచారించగా, హాస్పిటల్ సిబ్బంది ఓ బదులు, బీ బ్లడ్ గ్రూప్ ఎక్కించారని నిర్ధారణకు వచ్చారు. ఎవరి ఎవరి పై చర్యలు తీసుకోవాలి అనే విషయం పై సమాలోచనలు జరుపుతున్నారు. అయితే, ఇక్కడ ఏకంగా కలెక్టర్ నే, అక్కడి సిబ్బంది బురిడీ కొట్టించిన విధానం చూస్తుంటే, ఒక తప్పు చేసి, దాన్ని నిజం అని నమ్మించటానికి ఎన్ని వేషాలు వేసారో చూస్తే, వీళ్ళు డాక్టర్ల, క్రిమినల్స్ ఆ, అన్న అనుమానం రాక మానదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read