గత 5 ఏళ్ళ కాలంలో వినిపించిన రెండు సమస్యలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వినిపిస్తున్నాయి. ఒకటి కరెంటు కోతలు, రెండు రైతులకు విత్తన కష్టాలు. చంద్రబాబు అవలంభించిన విధానాలతో, రైతులకు సరైన సమయానికి విత్తనాలు అందేవి. సరైన టైంకు నీరు కూడా ఇచ్చేవారు. దీంతో సరైన టైంకు సాగు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రైతులకు మళ్ళీ విత్తన కష్టాలు ప్రారంభం అయ్యాయి. వర్షాలు పడుతున్నా, రైతులు పొలాల్లో కాకుండా, రోడ్ల మీద ఉంటున్నారు. ఈ ప్రజా సమస్యల పై స్పందించకుండా, వీటిని డైవర్ట్ చెయ్యటానికి, కూల్చివేతలు, కేసీఆర్ తో వారనికి ఒకసారి మంతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ విత్తన సమస్య అనంతపురం జిల్లాలో అధికంగా ఉంది. దీంతో ఈ విషయం పై, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రైతులకు విత్తన కష్టాల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ, రైతుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వర్షాలు పడుతున్నాయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు అవుతుంది, ఇప్పటి వరకూ రైతులకు, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు అంటే, ప్రభుత్వం ఎంత మొద్దు నిద్ర పోతున్నారో అర్థంఅవుతుంది అన్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్, సరైన సమయానికి, వేరుశనగ విత్తనం అందించడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి విధానాలతో, రైతులు రోడ్డెక్కే పరిస్థితి దాకా వచ్చిందని అన్నారు. ఈ సమయానికి, పొలాల్లో ఉండాల్సిన రైతులు, విత్తనాలు, ఎరువుల కోసం అర్ధరాత్రి వరకూ విత్తన కౌంటర్ల వద్ద పడిగాపులు పడినా, విత్తనాలు ఇవ్వటం లేదని, రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి తీసుకు వచ్చారాని ఆవేదన వ్యక్తం చేసారు. గడిచిన 5 ఏళ్ళ కాలంలో, టీడీపీ పాలనలో విత్తనాల కొరత రాకుండా చేసి, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే నాణ్యమైన విత్తనం, ఎరువులు అందించామని గుర్తుచేశారు. ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇప్పటికైనా రైతులకు విత్తనం, ఎరువులు అందించాలని, ఇంకా ఆలస్యమైతే, విత్తనాలు ఇచ్చినా రైతులు ఏమి చేసుకోలేరని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్‌ కోతలు పై కూడా బాలకృష్ణ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read