మన రాష్ట్రంలో "ఆ రెండు పత్రికలు" అంటూ వైఎస్ఆర్, జగన్ హయంలో పాపులర్ అయిన మాటలు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కూడా, ఆ మూడు పత్రికలు అంటూ, వాటి పై కక్ష పెంచుకున్నారని, జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి. ఇప్పటికే అన్ని వ్యవస్థలు మోడీ, అమిత్ షా చెప్పినట్టు ఆడుతున్నాయనే విమర్శలు నడుమ, మోడీ ప్రశ్నిస్తున్న అతి కొద్ది మంది మీడియాను కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేక కధనాలు రాసినా, ప్రసారం చేసినా ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ, రావటంతోనే మూడు పెద్ద పత్రికల పై కక్ష సాధింపు మొదలు పెట్టారు. దేశంలో బాగా పేరు ఉన్న పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియాతో, ది హిందూ, ది టెలిగ్రాఫ్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ ఇచ్చే ప్రకటనలను మోడీ నిలిపేశారు. పత్రికలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండే ప్రకటనలను నిలిపివేసి, ఆ సంస్థలు ఆర్దికంగా ఇబ్బంది పడేలా చేస్తున్నారు.
నెలకు 2.60 లక్షల సర్క్యులేషన్ ఉంటున్న టైమ్స్ గ్రూపుకు ప్రకటనలను పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ది టెలిగ్రాఫ్తోపాటు, ది హిందూ పత్రికకు కూడా ఆరు నెలలపాటు ప్రకటనలు ఆపమని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ది హిందూ పత్రిక రాఫెల్ పై తన పత్రికలో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ప్రభుత్వం మాత్రం, ఈ వార్తలను ఖండిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్స్ టైమ్స్ పత్రికలలో వచ్చిన కొన్ని వార్తల పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, అందుకే యాడ్స్‌ను నిలిపివేసినట్లు కోల్మన్ అండ్ కో ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీరు పై మాత్రం, ఆ పత్రికలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇలా కక్ష పూరిత విధానాలు అవలంభిస్తే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్నాయి.