తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో, విజయనిర్మల కుటుంబసభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కలిసి, సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనిర్మలకు నివాళులు అర్పించారు. చంద్రబాబు వచ్చే సరికి, అక్కడే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. కృష్ణ కుమారుడు నరేష్, వీరిని వెంట పెట్టుకుని, కృష్ణ దగ్గరకు తీసుకువెళ్ళారు. అక్కడే హీరో మహేష్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. కృష్ణ ని పరామర్శించి, ధైర్యం చెప్పారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, విజయనిర్మల గారు ఒక ఆశయం కోసం జీవించిన మహిళ అని, ఆమె ఆశయాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

విజయనిర్మల గారు, ఏదైనా పని అనుకుంటే, దాని కోసం ఎంత కష్టపడైనా సాధించే వారని అన్నారు. విజయ నిర్మలకు తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుకున్నారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీచేశారని గుర్తు చేసారు. తరువాత రాజకీయాలకు దూరం అయినా, కులుస్తూనే ఉండేవారని, ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని చంద్రబాబు గుర్తు చేసారు. ఒక చిన్న గాయం కారణంగా, విజయనిర్మల గారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, కృష్ణ గారు చెప్పారని, ఇది విధిరాత కాక మరేమిటి? అంటూ నిర్వేదం ప్రదర్శించారు చంద్రబాబు. కృష్ణ గారికి విజయనిర్మల గారు, పెద్ద బలం అని, ఆయనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వచ్చారని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని చెప్పారు. కష్టకాలంలో కృష్ణ గారు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read