తెలుగుదేశం అధినేత చంద్రబాబు, శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయిన సందర్భంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, తన పై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు పై చంద్రబాబు స్పందించారు. తనకు భద్రత తగ్గింపు విషయం పై పెద్దగా ఆందోళన లేదని, ఇలాంటి కక్ష సాధింపు ధోరణిని ఎదుర్కోవటం నాకు కొత్త ఏమి కాదని చంద్రబాబు అన్నారు. వెంకన్న ఆశీస్సులు, ప్రజల దీవెనలతోనే, అలిపిరిలో అంత పెద్ద దాడి జరిగినా బయట పడ్డానని చంద్రబాబు అన్నారు. తనకు భద్రత ఎంత తగ్గించినా పరవాలేదని, ప్రజలే తనకు రక్షకులని చంద్రబాబు అన్నారు. కాని, గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల చూస్తే బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే, రాష్ట్రానికి చాలా ప్రమాదమని చంద్రబాబు అన్నారు.

ఇలాగే దాడులు చేసుకుంటూ వెళ్తే, పెట్టబడులు రావని, ఇన్నాళ్ళు తాను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ నిర్మించిన కష్టం అంతా వృధా అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల పై దాడుల పై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. సాక్షాత్తూ హోంమంత్రిగా ఉన్న వ్యక్తే ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటికీ కాపలా ఉంటామా?, ఘటన జరిగిన తరువాత చెప్తే, చర్యలు తీసుకుంటాం అని చెప్పటం వింటుంటే, రాష్ట్రంలో సామాన్య ప్రజలకి రక్షణగా ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. హోంమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఇలా మాట్లాడటం ఏంటి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సుచరిత మాటలు వింటుంటే, దాడులు చెయ్యండి, తరువాత వచ్చి కేసులు పెడితే చూస్తాం అన్నట్టు ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వస్తారని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read