జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు నుంచి తాడేపల్లిలోని తన నివాసంలో, ప్రతి రోజు ఉదయం ప్రజా దర్భార్ నిర్వహిస్తారని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై గత వారం రోజులుగా, అన్ని వార్తా పత్రికల్లో, ఛానెల్స్ లో అతి ప్రచారం చేసారు. అన్ని జిల్లాల్లో కూడా, జగన్ మోహన్ రెడ్డి, ప్రతి రోజు వినతులు స్వీకరిస్తారాని, సమస్యలు ఆయనతోనే డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు అంటూ ప్రచారం చేసారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున వివధ జిల్లాల నుంచి తాడేపల్లి బాట పట్టారు. కాని నిన్న సడన్ గా, ప్రజా దర్భార్ కార్యక్రమం నెల రోజులు పాటు వాయిదా వేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సమాచారం మాత్రం ప్రజలకు చేరలేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, ప్రజా దర్బార్ కార్యక్రమం ఉందేమో అనే అంచనాలతోనే తాడేపల్లి వచ్చారు. కాని ఇక్కడకు వచ్చిన తరువాత విషయం తెలుసుకున్నారు. ఎక్కడో రాష్ట్రం మూల అటు అనంతపురం నుంచి, ఇటు శ్రీకాకుళం దాకా ప్రజలు తాడేపల్లి చేరుకున్నారు.

ఈ నేపధ్యంలో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజా దర్బార్ వాయిదా పడిందని చెప్పారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, జగన్ కొంత మందిని అయినా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ప్రజలు ఎక్కువ అవ్వటం, పోలీసులు బ్యారికేడ్ లు పెట్టటంతో, ప్రజలు కిక్కిరిసి పోయి ఉన్నారు. అయితే, జగన్ వద్దకు కొంత మందినే అనుమతిస్తారని సమాచారం రావటంతో, ఒక్కసారిగా గేటు దగ్గర ప్రజలు లోపలకి వెళ్ళే ప్రయత్నం చెయ్యటంతో, తోపులాట జరిగింది. ఈ తోక్కిసాలాటలో, అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడి పోయింది. వెంటనే ఆమెకు ప్రాధమిక చికిత్స చేసారు. అయితే ఇంకా రేకులు వెయ్యటం, బిల్డింగ్ లు రెడీ కాకపోవటంతోనే ప్రజా దర్బార్ వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏకంగా నెల రోజులు వాయిదా వేసేంత పని ఉంటే, ముందుగానే ప్రభుత్వం ఎందుకు హడావిడి చేసిందని, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ప్రజలను ఇబ్బంది పెట్టటం ఎందుకని ప్రజలు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read