రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఓ పెద్ద కంపెనీ ఉండాలి అనే టార్గెట్ తో, గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన కృషితో కృష్ణా జిల్లాకు కూడా ఒక పెద్ద కంపెనీ వచ్చింది. ఐటి రంగంలో పెద్దగా పెట్టుబడి అవకాశాలు లేకపోవటంతో, చంద్రబాబు ఆటోమొబైల్, మ్యానుఫాక్చరింగ్ రంగం వైపు అడుగులు వేసి, రాష్ట్రమంతటా పెట్టుబడులు తెచ్చారు. అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లాకు తెచ్చిన పెద్ద కంపెనీ, అశోక్‌ లేల్యాండ్‌. ప్రపంచ వ్యాప్తంగా, బస్సులు, లారీలు తయారు చేసే కంపనీల్లో టాప్ 10లో ఉన్న కంపెనీ. చంద్రబాబు చొరవతో, మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో, ఈ ప్లాంట్, బస్ బాడీ యూనిట్ ని నెలకోల్పింది. 75 ఎకరాల్లో, తొలి దశలో రూ.150 కోట్లతో, బస్‌బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసారు. రెండో దశలో 200 కోట్లు పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్లాంట్ లో, ఏడాదికి, 4.800 ఎలక్ర్టికల్‌ బస్సులను ఉత్పత్తి చేయాలన్నది అశోక్‌ లేల్యాండ్‌ లక్ష్యం. దానికి అనుగుణంగా, ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు.

అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారింది. ఈ కంపెనీ తీసుకువచ్చిన చంద్రబాబు ఓడిపోయారు. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ నిర్మాణం పూర్తి చేసుకుని, మొదటి బస్ ఉత్పత్తికి రెడీ అవుతుంది. మరో 15 రోజుల్లో ఈ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వచ్చేస్తుంది. ఇప్పటికే మొదటి బస్ కు సంబధించి, కొద్దిరోజులుగా ఎలక్ర్టికల్‌ బస్సులకు బాడీ నిర్మాణం చేపడుతున్నారని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న వారికి ఉపాధి ఇవ్వాలనే ఒప్పందంలో భాగంగా, ఎక్కువ మంది స్థానిక మహిళలే అక్కడ ఉపాధి పొందుతున్నారు. వీరే ఇక్కడ బస్ నిర్మాణం చేస్తున్నారని. నిపుణల పర్యవేక్షణలో, ఈ పని జరుగుతుంది. మల్లవల్లి నుంచి తయారు అయ్యే తొలి ఎలక్ర్టిక్‌ బస్‌, మన దేశానికి కాకుండా, ప్రపంచ మార్కెట్ కు కూడా ఉపయోగ పడేలా ఉంటుంది. అందుకు అనుగుణంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా బస్ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులు పూర్తయిన వెంటనే, మొదటి బస్ ను విడుదల చెయ్యనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read