మాట తడబటం, మానవ నైజం.. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట తడబడ్డారు అంటే, సోషల్ మీడియా కాలంలో, ఫుట్ బాల్ ఆడుకుంటారు నెటిజెన్ లు. గతంలో, చంద్రబాబు, లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా మాట తడబడితే, అప్పట్లో వైసీపీ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చివరకు పేపర్ లో, టీవీల్లో కూడా వేసుకుని, ఆనందం పొందే వారు. ఇప్పుడు వారు అధికారంలోకి రావటంతో, అందరి ఫోకస్ వారి పైనే ఉంటుంది. తాజగా, అప్పట్లో టిడిపి నేతలని ఎగతాళి చేసిన కర్మ ఫలం, ఇప్పుడు వైసీపీ అనుభవిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మీడియాతో మాట్లాడుతూ, మాట తడబడ్డారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పుష్ప శ్రీవాణి సొంత జిల్లా విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వచించారు.
మీడియాతో మాట్లాడిన ఆమెడిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట తడబడ్డారు. జగన్ పాలన గురించి ప్రస్తావిస్తూ, "మా ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అని పుష్పశ్రీవాణి తడబడ్డారు. అయితే ఆమె పక్కనే ఉన్న అనుచరులు, తప్పుగా మాట్లడారు అని అలెర్ట్ చేయడంతో తప్పు తెలుసుకున్న డిప్యూటీ సీఎం మాటమార్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పెద్దఎత్తున షేర్లు కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా, ఈ వీడియో పోస్ట్ చేసారు. https://www.facebook.com/176339886320125/videos/355419888497830/